సెప్టెంబర్ 3న ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌ఐ కోటా యూజీ సీట్లకు వాక్‌‌‌‌ఇన్‌‌‌‌ కౌన్సెలింగ్‌‌‌‌

సెప్టెంబర్ 3న ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌ఐ కోటా యూజీ సీట్లకు వాక్‌‌‌‌ఇన్‌‌‌‌ కౌన్సెలింగ్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ప్రొఫెసర్‌‌‌‌ జయశంకర్‌‌‌‌ అగ్రికల్చర్ వర్సిటీ పరిధిలోని కళాశాలల్లో 2026-–27 విద్యా సంవత్సరానికి అండర్‌‌‌‌ గ్రాడ్యుయేట్‌‌‌‌ (యూజీ) కోర్సుల్లో ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌ఐ/ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌ఐ స్పాన్సర్డ్‌‌‌‌ కోటా కింద మిగిలిన సీట్ల భర్తీకి సెప్టెంబర్‌‌‌‌ 3న వాక్‌‌‌‌-ఇన్‌‌‌‌ కౌన్సెలింగ్‌‌‌‌ నిర్వహించనున్నట్టు వీసీ ప్రొఫెసర్‌‌‌‌ అల్దాస్‌‌‌‌ జానయ్య తెలిపారు. రాజేంద్రనగర్‌‌‌‌లోని వర్సిటీ ఎగ్జామినేషన్స్‌‌‌‌ సెంటర్‌‌‌‌లో ఉదయం 10 గంటలకు సర్టిఫికెట్ల పరిశీలన, కౌన్సెలింగ్‌‌‌‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు.

ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారితో పాటు, ఇంతకుముందు దరఖాస్తు చేసుకోని అర్హులైన అభ్యర్థులు కూడా ఈ కౌన్సెలింగ్‌‌‌‌కు హాజరుకావచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులు అవసరమైన సర్టిఫికెట్లు, ఫీజుతో కౌన్సెలింగ్‌‌‌‌కు హాజరుకావాలని, పూర్తి వివరాల కోసం www.pjtau.edu.in వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ను సందర్శించాలని సూచించారు.