Electric Scooter : సింపుల్ వేవ్ స్కూటర్.. ఒక్క చార్జ్తో 243 కి.మీ.

Electric Scooter : సింపుల్ వేవ్ స్కూటర్.. ఒక్క చార్జ్తో 243 కి.మీ.

సింపుల్ ఎనర్జీ వేవ్ పేరుతో ఈ  స్కూటర్ ను  విడుదల చేసింది. ఐదు కిలోవాట్ల బ్యాటరీ ఉండే టాప్ ​మోడల్​ను ఒక్కసారి చార్జ్ చేస్తే 243 కిలోమీటర్లు వెళ్తుంది.  3.7 కిలోవాట్ల మోడల్ 171 కిలోమీటర్లు, 2.7 కిలోవాట్ల మోడల్ 132 కిలోమీటర్లు, 2.2 కిలోవాట్ల 110 కిలోమీటర్ల రేంజ్ ఇస్తాయి.  గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు వెళ్తుంది.  ధరలు రూ.1.10 లక్షల నుంచి మొదలవుతాయి.

సింపుల్ వేవ్ ( Simple Wave) - ఇది బెంగళూరుకు చెందిన Simple Energy కంపెనీ మొదటి ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్. సెప్టెంబర్ 2, 2026 న లాంచ్ అయింది. ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1లక్షా 09వేల 999. సెప్టెంబర్ చివరి వారం నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి. బుకింగ్స్ ఓపెన్ లో ఉన్నాయి.

వేరియంట్లు,బ్యాటరీ రేంజ్.. మొత్తం 6 మోడల్స్, 3 వేరియంట్లలో - Wave S, Wave, Wave+
ఛార్జింగ్..6.4 kW PMSM మిడ్-మౌంటెడ్ మోటార్ (బేస్ మోడల్ కి 4.5 kW)

IP67 వాటర్ ప్రూఫ్ బ్యాటరీ & మోటార్

ఫాస్ట్ ఛార్జింగ్: 0-80% కేవలం 2 గంటల 15 నిమిషాల్లో 
750W పోర్టబుల్ ఛార్జర్ అన్ని వేరియంట్లతో వస్తుంది
కలర్స్: 6 రంగుల్లో అందుబాటులో ఉంది. పియరల్స్ వైట్ , పోలార్ బ్లూ, ఫారెస్ట్ గ్రీన్, కోరల్ ఎరుపు, ట్వైలైట్ బ్లాక్ , డాల్ఫిన్ గ్రే