కృష్ణాష్టమి.. జన్మాష్టమి అనగా శ్రీ కృష్ణునిరోజు. మానవులను ఉద్దరించానికి సాక్షాత్తు విష్ణుమూర్తి 8వ అవతారంగా ద్వాపర యుగంలో దేవకి వసుదేవుల దంపతులకు కారాగారంలో జన్మించిన విషయం తెలిసిందే. అసలు కారాగారంలో జన్మించిన వాడిని ఎందుకు పూజించాలి..కృష్ణాష్టమి రోజున ఆ వాసుదేవుడిని పూజిస్తే సమస్యలకు పరిష్కారం లభిస్తుందా.. పురాణాల్లో ఏముంది.. పండితులు ఏంచెబుతున్నారు..మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం...!
పురాణాల ప్రకారం శ్రీరాముడు.. శ్రీకృష్ణుడు మానవులు ఉద్దరించడానికి..కలియుగంలో ఎలా జీవించాలి.. సమస్యలనుఎలా పరిష్కరించుకోవాలి..ఇలా అనేక అంశాలను మానవులకు తెలియజెప్పేందుకు భూమిపై అవతరించారని పండితులు చెబుతున్నారు. అలా సాక్షాత్తు విష్ణుమూర్తి కలియుగంలో శ్రీరాముడు జన్మిస్తే.. ద్వాపరయుగంలో శ్రీ కృష్ణుడు జన్మించారు,
ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు జన్మించిన నాటి నుంచి ఆయన చూపిన మహిమలు అన్నీ ఇన్నీ కావు.. చిన్న తనంలోనే గోపాలబాలకులను రక్షించడం వంటి కథనాలు ఎన్నో ఉన్నాయి. పండితులు తెలిపిన వివరాల శ్రావణమాసం కృష్ణపక్షం అష్టమి తిథినాడు జన్మించాడు. ఈ ఏడాది(2026) అలాంటి పవిత్రమైన రోజు సెప్టెంబర్ 4 వచ్చింది.
శ్రీమహావిష్ణువు అవతారాల్లో శ్రీకృష్ణావతారం విశిష్టమైనది., అందుకే కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన దివ్య తిథినే ‘కృష్ణాష్టమి’ గా జరుపుకుంటారు., కృష్ణాష్టమిని జన్మాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి అన్ని కూడా పిలుస్తారు. ఈ పండుగ రోజున ఉదయాన్నే స్నానాదులు పూర్తి చేసి షోడశోపచారాలతో కృష్ణుడికి అర్చన చేస్తారు., ఆయనకు ఎంతో ఇష్టమైన అటుకులు, వెన్న, పాలు, పెరుగు, మీగడ మొదలైనవన్నీ నైవేద్యంగా సమర్పిస్తారు.
కృష్ణాష్టమి (సెప్టెంబర్ 4)న హిందువులు ప్రతి ఇంటా బాలకృష్ణుని చిన్న చిన్న పాదాలు లోగిల్లలో వేసి కృష్ణుడు ఇంట్లోకి రావాలని భక్తులు పూజలు చేస్తారు. ఇంటి ముఖ ద్వారాలకు పచ్చని మావిడాకు తోరణాలు, వివిధ పూవులతో తోరణాలు కడతారు,. కృష్ణుడి విగ్రహాన్ని తడి వస్త్రంతో శుభ్రం చేసి,. చందనం, కుంకుమలతో తిలకం దిద్దుతారు., కృష్ణుని విగ్రహాన్ని, పూజా మందిరాన్ని పూవులతో అలంకరిస్తారు,. అక్షింతలు, ధూపదీపాలతో స్వామి వారిని పూజిస్తారు. ఇలా చేయడం వలన సమస్యలు పరిష్కరమవుతాయని పండితులు చెబుతున్నారు.
పూజాది క్రతువు పూర్తైన తర్వాత శ్రీకృష్ణ లీల ఘట్టాలని చదవాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి., కృష్ణాష్టమి నాడు కేవలం భగవానుని పూజించడమే కాదు, అయనలోని కొన్ని మంచి లక్షణాలని అలవర్చుకోవాలి., ప్రతి విషయంలోనూ స్వార్ధం, ఈర్ష్య, అసూయలను కొంతైన విడనాడి,. మానవజన్మకు సార్ధకతని ఏర్పరచుకోవాలని పండితులు చెబుతున్నారు.
శ్రీకృష్ణుడు తన లీలల ద్వారా మానవులకు జ్ఞానోపదేశం చేశాడు.,. ఆయన చేసిన అన్ని పనులలోను అర్థం పరమార్థం కనిపిస్తాయి., ధర్మ పరిరక్షణలో రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాడు..
కాబట్టి కృష్ణాష్టమి రోజున కృష్ణుని అర్చిస్తే సకల పాపాలు పోతాయి., ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతాయని స్కాందపురాణం చెబుతుంది.,
కృష్ణాష్టమి (2026 సెప్టెంబర్ 4) వ తేదీన బంగారంతో కాని, వెండితో కాని చంద్రబింబాన్ని తయారుచేసి వెండి, బంగారు పాత్రలలో దానిని ఉంచి పూజించి అర్ఘమిస్తే సకల కోరికలు తీరుతాయని భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తుంది. ఆర్థిక స్థోమత లేని వారు చిత్ర పటానికైనా పూజలు చేయవచ్చు. ఏకాగ్రతతలో భక్తితో శ్రద్దగా పూజించాలి,
అంతే కాకుండా ఈ రోజు భీష్మాచార్యులను పూజిస్తే సకల పాపాలు తొలగుతాయని మహర్షులు చెప్పారు,. సంతానం లేని వారు బాల కృష్ణుడిని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే సంతానం కలుగుతుంది.,
ఇంకా వివాహం కానివారు, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు రుక్మిణి కళ్యాణం పారాయణం చేయడం వల్ల వారికి వివాహ యోగం కలుగుతుంది., అలాగే శ్రీకృష్ణున్ని స్మరిస్తూ గోవులను దానం చేస్తే ఆ భగవానుడి అనుగ్రహం, కృప కలుగుతాయని పండితులు చెబుతున్నారు..
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
