నవీపేట మండలం అనంతగిరి శివారు మిల్లులో నిల్వ ఉంచిన 523 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

నవీపేట మండలం అనంతగిరి శివారు మిల్లులో నిల్వ ఉంచిన 523 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అనంతగిరి శివారులోని ఎస్ఆర్ఎం ట్రెజర్స్ మిల్లులో నిల్వ ఉంచిన 523 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి వచ్చిన టాస్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్, సివిల్ సప్లయ్ అధికారులు, పోలీసులు సంయుక్తంగా మిల్లులో తనిఖీలు చేశారు.

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలిలోని అన్నపూర్ణ ట్రేడర్స్ నుంచి ఇక్కడి మిల్లుకు తరలించినట్లు అధికారులు తెలిపారు. అనంతరం రేషన్ బియ్యం, డీసీఎం సీజ్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఎస్ఆర్ఎం ట్రేడర్స్‌‌‌‌‌‌‌‌ ఓనర్ శివప్రసాద్, అన్నపూర్ మిల్‌‌‌‌‌‌‌‌ ఓనర్ హరికృష్ణపై కేసు నమోదు చేశారు.