MS Dhoni Smoke Hookah: శ్రీలంకతో టెస్టు సిరీస్ విజయం తర్వాత టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో కలిసి గ్రాండ్‌గా పార్టీ చేసుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ వీడియోలో వీరిద్దరూ తమ ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో కలిసి చిల్ అవుతూ, డాన్స్ చేస్తూ కనిపించారు. కానీ, ఈ సెలబ్రేషన్స్ మధ్యలో ఎవరో ఒకరు జరా హుక్కా పీకే ఆతా హూ (ఇప్పుడే హుక్కా తాగి వస్తా) అని అన్న మాటలు బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించడంతో నెటిజన్లు ఆ కామెంట్‌ను పట్టుకుని సోషల్ మీడియాలో జోరుగా చర్చించుకుంటున్నారు.
హుక్కా కామెంట్ వెనుక అసలు కథేంటి?:
ఆ వీడియోలో హుక్కా గురించి మాట్లాడింది ఎవరనేది అధికారికంగా ధృవీకరించబడనప్పటికీ, అభిమానులు మాత్రం ఆ వ్యాఖ్యలను ఎంఎస్ ధోనీకే ముడిపెడుతున్నారు. గతంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ జార్జ్ బెయిలీ కూడా ధోనీకి హుక్కా (షీషా) తాగే అలవాటు ఉందని వెల్లడించిన సంగతి తెలిసిందే. టూర్ల సమయంలో ధోనీ తన గదిలో హుక్కా సెటప్ చేసుకుని, యంగ్ ప్లేయర్లతో సరదాగా మాట్లాడేందుకు ఎప్పుడూ ఓపెన్ డోర్ పాలిసీ పాటించేవాడని బెయిలీ పేర్కొన్న వ్యాఖ్యలను నెటిజన్లు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.
ధోనీ ఆల్-టైమ్ రికార్డును బద్దలుకొట్టిన పంత్:
పార్టీ ముచ్చట్లు పక్కనబెడితే, మైదానంలో రిషభ్ పంత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. విదేశీ గడ్డపై భారత్ తరఫున వికెట్ కీపర్‌గా అత్యధిక పరుగులు చేసిన ఎంఎస్ ధోనీ రికార్డును పంత్ తుడిచిపెట్టేశాడు. ధోనీ 2,496 పరుగులు చేయగా, పంత్ 41 కంటే ఎక్కువ సగటుతో ఏకంగా 2,534 రన్స్ సాధించి నంబర్-1 స్థానానికి చేరుకున్నాడు. ఫరూక్ ఇంజనీర్ (1,209), సయ్యద్ కిర్మాణి (1,109), కిరణ్ మోరే (901) తదుపరి స్థానాల్లో కొనసాగుతున్నారు.
ALSO READ : బీసీసీఐ కీలక భేటీ.. రోహిత్ కెరీర్‌పై బిగ్ కాల్?
గిల్‌క్రిస్ట్ రికార్డు కూడా ఔట్:
ఇంతటితో ఆగకుండా, టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ల జాబితాలో ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ను కూడా పంత్ అధిగమించాడు. టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన మూడో బ్యాటర్‌గా పంత్ అరుదైన ఘనత సాధించాడు. శ్రీలంకపై టెస్టు సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన రిషభ్, ప్రస్తుతం మైదానం లోపలా బయటా ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్నాడు.
Rishab 😂😂😂 pic.twitter.com/M93dlPsGwF
— 𝗦💛 (@mostlydhoni78) September 2, 2026
