గడచిన నాలుగు రోజులుగా తగ్గుతూ పోతున్న బంగారం ధరలకు తిరిగి రివర్స్ టర్న్ తీసుకున్నాయి. ప్రధానంగా అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఈ మధ్య ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు బులియన్ మార్కెట్లను అలజడికి గురిచేస్తున్నాయి. దీంతో బంగారం, వెండి ధరలు ఊహించని రీతిలో భారీ పెరుగుదలను నమోదు చేశాయి. ఈ క్రమంలో శ్రావణమాసంలోని చివరి శుక్రవారం కోసం షాపింగ్ చేయాలనుకుంటున్న తెలుగు ప్రజలు ముందుగా తమ నగరాల్లోని రిటైల్ విక్రయ ధరలను పరిశీలించటం చాలా ముఖ్యం.
సెప్టెంబర్ 3న బంగారం రేట్లు భారీగా పెరిగాయి. సెప్టెంబర్ 2 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా రూ.333 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 535గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 240గా కొనసాగుతోంది.
గురువారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. సెప్టెంబర్ 3, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.5వేలు పెరిగాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీ రూ.2లక్షల 55వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.255 దగ్గర ఉంది.
