- 23 వేల మందికి డెల్శిక్షణ..
ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ ఎలక్ట్రానిక్స్ లో శిక్షణ తీసుకోవాలనుకునేవారికి గుడ్ న్యూస్.. ప్రముఖ కంప్యూటర్ల తయారీ సంస్థ 23 వేలమంది యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఉడాన్ పేరుతో శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది. మన హైదరాబాద్ లోని ఐటీఐ సెంటర్లలో ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
డెల్ టెక్నాలజీస్ ఉడాన్ పేరుతో శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఐఐటీ ఢిల్లీ , లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్, జనరేషన్ ఇండియా ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, ఎలక్ట్రానిక్స్లో 23 వేల మంది యువతకు నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తారు. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణేలోని 100 ఐటీఐలు, 90 విద్యాసంస్థల్లో ఈ కార్యక్రమం అమలవుతుంది. పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా ప్రత్యేక సిలబస్ను తయారు చేస్తారు.
