హైదరాబాద్ సిటీలో 10 రోజుల్లో ..154 అక్రమ భవనాల కూల్చివేత

హైదరాబాద్ సిటీలో 10 రోజుల్లో ..154 అక్రమ భవనాల కూల్చివేత

హైదరాబాద్ సిటీ, వెలుగు: సీఎంసీ సరిధిలో రూల్స్​కు విరుద్ధంగా నిర్మించిన అక్రమ కట్టడాలపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతనెల 24 నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు 10 రోజుల్లో 154 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు అధికారులు ప్రకటించారు. శేరిలింగంపల్లిలో 69, కుత్భుల్లాపూర్ లో 52, కూకట్ పల్లిలో జోన్ లో 33 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశామని తెలిపారు.  

సుభాష్ చంద్రబోస్ ​నగర్​లో...  

మాదాపూర్, వెలుగు: మాదాపూర్​సర్కిల్​మాతృశ్రీ నగర్ డివిజన్ న్యూ హఫీజ్ పేట్‌‌‌‌‌‌‌‌లోని సుభాష్ చంద్రబోస్ నగర్‌‌‌‌‌‌‌‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ఉద్రికత్తతకు దారి తీశాయి. ప్రభుత్వ స్థలాలు, అనుమతులు లేని స్థలాల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించేందుకు టౌన్​ ప్లానింగ్​ అధికారులు బుధవారం బాహుబలి క్రేన్లను రంగంలోకి దించారు. అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్నారని తెలుసుకున్న స్థానికులు, భవన నిర్మాణదారులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. 

తమ కష్టార్జితంతో నిర్మించుకున్న ఇళ్లను, నిర్మాణాలను కూల్చివేయొద్దని మున్సిపల్ అధికారుల కాళ్లపై పడి వేడుకున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తే తాము రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర స్థాయిలో తోపులాట, వాగ్వాదం జరిగాయి. అనంతరం భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్రమ భవనాల కూల్చివేతలు చేపట్టారు.