సుమన్ కీలక పాత్రలో మా రాముడు అందరివాడు

సుమన్ కీలక పాత్రలో మా రాముడు అందరివాడు

శ్రీరామ్, స్వాతి మందాడి జంటగా యద్దనపూడి మైకిల్ దర్శకత్వంలో అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు  నిర్మించిన చిత్రం ‘మా రాముడు అందరివాడు’. సుమన్, సమ్మెట గాంధీ, నాగ మహేష్, బాహుబలి ప్రభాకర్  కీలక పాత్రలు పోషించారు.

సెప్టెంబర్ 4న సినిమా విడుదల సందర్భంగా ప్రీ రిలీజ్‌‌ ఈవెంట్‌‌ నిర్వహించారు.  అతిథులుగా హాజరైన నిర్మాత వెంకట్ దుగ్గిరెడ్డి, దర్శకుడు శ్రీనివాస తేజ బెస్ట్ విషెస్‌‌ చెప్పారు.  

ఇందులో సీఎంగా మంచి మెసేజ్‌‌ ఇచ్చే పాత్రలో కనిపించానని, చక్కని కథ, ట్విస్టులతో ఆసక్తికరంగా ఉంటుందని సుమన్‌‌ చెప్పారు. ఇందులోని ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుందని,  కచ్చితంగా అందరినీ ఆకట్టుకునే సినిమా అవుతుందని దర్శకనిర్మాతలు వెల్లడించారు.