7 పి.ఎం. ప్రొడక్షన్స్ నెక్స్ట్ సినిమా ఇ.ఎం.ఐ

7 పి.ఎం. ప్రొడక్షన్స్ నెక్స్ట్ సినిమా ఇ.ఎం.ఐ

‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ చిత్రంతో మెప్పించిన 7 పి.ఎం. ప్రొడక్షన్స్ సంస్థ... ‘ఇ.ఎం.ఐ’ పేరుతో మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించింది. ‘హాస్టల్ డేస్‌‌’ ఫేమ్ దరహాస్‌‌, ‘లిటిల్‌‌ హార్ట్స్‌‌’ ఫేమ్ శైలజ జంటగా నిఖిల్ కువ్వరపు తెరకెక్కిస్తున్నాడు.  బుధవారం లాంఛనంగా ప్రారంభించారు.  

ముహూర్తపు సన్నివేశానికి హీరో ఆది సాయికుమార్ క్లాప్ ఇవ్వగా, డైరెక్టర్ సాయి మార్తాండ్ కెమెరా స్విచాన్ చేశారు. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ స్క్రిప్ట్‌‌ను టీమ్‌‌కు అందజేశారు. ‘ఇ.ఎం.ఐ’ల వల్ల యూత్‌‌ ఎదుర్కొంటున్న ఇబ్బందులకు హార్ట్ టచింగ్ ఎమోషన్స్ జోడించి కంప్లీట్ ఎంటర్‌‌‌‌టైనర్​గా తెరకెక్కిస్తున్నట్టు మేకర్స్‌‌ తెలియజేశారు.