సీజన్ తో పాటు స్కిన్ కేర్ రొటీన్ కూడా మారుతుంది. శీతాకాలంలో చర్మం పొడిబారకుండా చూసుకోవాలి. అందుకోసం ఇంటివద్ద తయారు చేసుకున్న బాడీ స్క్రబ్ వాడటం బెటర్. ఇదయితే మురికితో పాటు మృతకణాల్ని కూడా తొలగిస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.
కావాల్సినవి:
బియ్యప్పిండి-50 గ్రా., మసూర్ దాల్ (ఎర్రకందిపప్పు) - 30 గ్రా. ఓట్స్ - 20 గ్రా. ముల్తానీ మట్టి- 20 గ్రా. రెండు గ్రాముల చొప్పున వేపాకుల పొడి, పసుపు, కొన్ని చుక్కల లావెండర్ లేదా ఎసెన్షియల్ ఆయిల్, కొంచెం పెరుగు.
తయారీ:
ఒక గిన్నెలో పైన చెప్పిన వాటన్నింటినీ వేసి కలపాలి. ఈ స్క్రబ్ తో ముఖం మీద మెల్లిగా మసాజ్ చేయాలి. ఆరాక నీళ్లతో కడిగేయాలి. దాంతో ముఖం మీది మురికి, డెడ్ సెల్స్ పోయి చర్మం తాజాగా ఉంటుంది.
