ఇరాన్ ,అ మెరికా మధ్య ఉద్రికత్తలు కొనసాగుతున్న సమయంలో హార్ముజ్ జలసంధిపై ట్రంప్ ప్రకటన, వైట్ హౌజ్ మ్యాప్ లపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ‘‘చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి ఇప్పుడు మా అధీనంలో ఉంది.. ఇక హార్ముజ్ జలసంధిని ట్రంప్ జలసంధిగా మార్చడమే ఆలస్యం’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆయన వ్యాఖ్యలు నిజమన్నట్లుగానే వైట్ హౌజ్ కూడా మ్యాప్ ను కూడా సిద్దం చేసి షేర్ చేసింది. గతంలో ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ ఇంత పెద్దచర్చకు రాలేదు. ట్రంప్ మాటలు, వైట్ హౌజ్ చర్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారాయి.
బుధవారం (సెప్టెంబర్ 2) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ట్రూత్ సోషల్ లో ఓ పోస్ట్ ను షేర్ చేస్తూ..‘‘ఇప్పుడు హార్ముజ్ జలసంది అమెరికా నియంత్రణలో ఉంది కాబట్టి దాని పేరును ట్రంప్ స్ట్రయిట్ గా మార్చాలా.. అమెరికా మాదిరిగానే హాట్ గా ఉంటుంది’’ అని రాశారు.
ట్రంప్ వ్యాఖ్యలు నిజమన్నట్టుగానే అమెరికా వైట్ హౌజ్ కూడా ఏకంగా మ్యాప్ నే మార్చి ట్రంప్ స్ట్రయిట్ గా చూపించింది. దానికి ఇట్స్ గాట్ ఏ నైస్ రింగ్ టు ఇట్ అని క్యాప్షన్ కూడా ఇచ్చింది.
