మెదక్ జిల్లాలో యూరియా కోసం చెప్పుల క్యూ లైన్

మెదక్ జిల్లాలో యూరియా కోసం చెప్పుల క్యూ లైన్

పాపన్నపేట/శివ్వంపేట, వెలుగు:  యూరియా కోసం బుధవారం మెదక్​ జిల్లా పాపన్నపేట, శివ్వంపేట మండల కేంద్రాల్లోని  ప్రాథమిక సహకార సంఘాల వద్ద రైతులు పెద్ద సంఖ్యలో చెప్పులను క్యూ లైన్​లో పెట్టారు. యూరియా తీవ్ర ఇబ్బందిపడుతున్నామని వారు వాపోయారు. పాపన్నపేటలో ఈ పాస్​మిషన్​ పనిచేయక పోవడంతో రైతులు గంటల తరబడి వేచి ఉన్నారు.