హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీజీ టెట్ ఇన్ సర్వీస్ టీచర్స్-2026 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్ల డౌన్లోడ్ ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. ఈ నెల 8, 9 తేదీల్లో జరగనున్న ఈ ఆన్లైన్ పరీక్షలకు ఎస్సీఈఆర్టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను ఎంటర్ చేసి అధికారిక వెబ్సైట్ https://schooledu.telangana.gov.in
ద్వారా హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని టెట్ కన్వీనర్ రమేశ్ సూచించారు.
ఈ పరీక్షలు రెండు రోజుల పాటు మొత్తం 3 సెషన్లలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహించనున్నారు. ఈ పరీక్షల నిర్వహణకు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 41 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 24,985 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలోని 7 కేంద్రాల్లో 8,150 మంది, మేడ్చల్లోని 8 కేంద్రాల్లో 5,514 మంది, కరీంనగర్లోని 5 కేంద్రాల్లో 2,687 మంది, ఖమ్మంలోని 6 కేంద్రాల్లో 2,671 మంది, హన్మకొండ జిల్లాలోని 4 కేంద్రాల్లో 2,491 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.
