ఆరోగ్యశ్రీ స్కీం ఘనత వైఎస్సార్దే:మంత్రి పొన్నం ప్రభాకర్

ఆరోగ్యశ్రీ స్కీం ఘనత వైఎస్సార్దే:మంత్రి పొన్నం ప్రభాకర్

పంజాగుట్ట, వెలుగు: పేదల దేవుడు మాజీ సీఎం దివంగత వైఎస్సార్​అని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ  పథకాలు నేటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని జిల్లా ఇన్​చార్జి  మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం వైఎస్సార్​17 వర్ధంతి సందర్భంగా పంజాగుట్ట సర్కిల్​లోని ఆయన విగ్రహానికి మంత్రులు వాకటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్​కుమార్​లతో కలిసి నివాళి అర్పించారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్​మెంట్ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డికే దక్కుతుందన్నారు. సామాజీగూడ మాజీ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పంజాగుట్ట డివిజన్ అధ్యక్షుడు అరికెల నరేశ్ కుమార్, సీనియర్ నాయకుడు, వెంకటేశ్వర స్వామి ఆలయ మాజీ  చైర్మన్ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.