ఫ్యాన్ బాయ్ అనే ప్రేమ ప్రభాస్ గారిలో కనిపించింది

 ఫ్యాన్ బాయ్ అనే ప్రేమ ప్రభాస్ గారిలో  కనిపించింది

మేం ఫేమస్‌‌,  గోదారి గట్టుపైన చిత్రాలతో హీరోగా ఆకట్టుకున్న సుమంత్ ప్రభాస్‌‌.. ఇప్పుడు ‘రోమాంచకం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించాడు.  దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ చిత్రం గురువారం విడుదలవుతోంది.

ఈ సందర్భంగా హీరో సుమంత్ ప్రభాస్‌‌ మాట్లాడుతూ ‘ఇంజినీరింగ్ పూర్తి చేసి ఓ స్టార్టప్ కంపెనీ పెట్టే ప్రయత్నాల్లో ఉన్న యువకుడిగా ఇందులో కనిపిస్తా.  క్యూట్‌‌గా, ఇన్నోసెంట్‌‌గా ఉండే క్యారెక్టర్‌‌‌‌.  ఈ పాత్ర  కోసం డైరెక్టర్ వేణుగోపాల్ గారు ఆర్నెల్లు వర్క్‌‌ షాప్స్‌‌ నిర్వహించారు.  

ఫస్ట్ కాపీ చూశాక సందీప్ అన్న బాగా పర్​ఫార్మ్ చేశావంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. ఆరేళ్ల నుంచి అరవై ఏళ్ల వరకు ఎవరైనా చూసి ఒకేలా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీస్‌‌, ఫ్రెండ్స్‌‌తో చూడొచ్చు. ప్రతి సీన్ నవ్వు తెప్పిస్తుంది. ప్రేక్షకులకు ఇందులోని ఫ్రెష్ నెస్ కచ్చితంగా నచ్చుతుంది.

 ఆద్యంతం రోమాంచకం ఫీల్‌‌ను కలిగిస్తుంది.  ప్రభాస్‌‌ గారిని కలిసిన మూమెంట్‌‌ నా లైఫ్‌‌లో రోమాంచకం. నా గతం, నా జర్నీ అంతా గుర్తొచ్చింది. ఆయన చాలా బాగా రిసీవ్‌‌ చేసుకున్నారు.  మన ఫ్యాన్ బాయ్ అనే ప్రేమ ఆయనలో కనిపించింది. ఇక నెక్స్ట్​ ‘రాజు వెడ్స్ రాంబాయి’ డైరెక్టర్ సాయిలు డైరెక్షన్‌‌లో ఓ సినిమా చేయబోతున్నా” అని చెప్పాడు.