ఓటర్ లిస్టు నుంచి రాఘవ్ చద్ధా పేరు తొలగింపు.. సర్ ప్రక్రియపై కీలక వ్యాఖ్యలు

ఓటర్ లిస్టు నుంచి రాఘవ్ చద్ధా పేరు తొలగింపు.. సర్ ప్రక్రియపై కీలక వ్యాఖ్యలు

సర్ ప్రక్రియతో ఎన్నికల కమిషన్ ఉద్దేశపూర్వకంగానే ఓట్లు తొలగిస్తోందనే ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా విపక్ష పార్టీల ఓట్ బ్యాంక్ ను దెబ్బకొట్టేలా, ఎన్డీఏకు మేలు చేసేలా ఈసీ వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీజేపీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్ధా ఓటు తొలగింపు వివాదాస్పదంగా మారింది. పంజాబ్ సర్ ప్రక్రియలో తన ఓటు తొలగింపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. 

పంజాబ్ ఎలక్ట్రోరల్ రోల్స్ డ్రాఫ్ట్ లో చద్ధా పేరు లేకపోవడంతో.. ఇది రాజకీయ కక్ష్య అని, కుట్ర పూరితంగానే తన ఓటు తొలగించారని ఆరోపించారు. 

ఆగస్టు 13న ప్రచురించిన పంజాబ్ ఎలక్టరోరల్ రోల్ డ్రాఫ్ట్ లో చద్దా పేరు ASDD  (Absent, Shifted, Deceased and Duplicate) కేటగిరిలో పడిపోయింది. ఆ రాష్ట్రంలో మొత్తం 20 లక్షల 66 వేల ఓట్లు తొలగిస్తే.. అందులో చద్దా పేరు కూడా ఉండటం గమనార్హం. 

అయితే షిఫ్టెడ్.. చిరునామా మారినట్లు తన పేరును మార్క్ చేసింది ఎవరు..? ఆప్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. ఆ కేటగిరీలో క్లాసిఫై చేసిందెవరు.. ఆప్ ప్రభుత్వంలో పనిచేసే ఆఫీసర్ కాదా..? ఉన్నత స్థాయిలో ప్రాసెస్ చేసింది ఎవరు.. ఆప్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం అని ఆరోపించారు. 

మొహాలిలో తన ఓటు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు చెప్పిన చద్ధా.. ఎందుకు ఇక్కణ్నుంచి మారినట్లు చూపించారని ప్రశ్నించారు. 

ఇది కేవలం క్లరికల్ మిస్టేక్ లా అనిపించడం లేదని..  ఇది స్పష్టమైన రాజకీయ కక్ష సాధింపు చర్యగా చద్ధా ఆరోపించారు.  పార్టీని వీడిన వారిపై ఆప్ ప్రభుత్వం రాష్ట్ర పరిపాలనా యంత్రాంగాన్ని వాడుకుంకుని కక్ష్క సాధింపులకు పాల్పడుతోందని అన్నారు.   

ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న చద్ధా.. 2026 ఏప్రిల్ లో బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. సామాన్యుల సమస్యలను పార్లమెంటులో లేవనెత్తే చద్ధా.. బీజేపీలో చేరికపై అప్పట్లో విమర్శలు వచ్చాయి.