హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై చర్యలకు కాంగ్రెస్ సిద్ధమైంది. మంత్రి కొండా సురేఖ రాజీనామా చేసేందుకు ససేమిరా అనడంతో ఆమెను బర్తరఫ్ చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. మంత్రి కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడంతో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది. కొండా సురేఖ ఇప్పటికే వరంగల్ వెళ్లి కార్యకర్తలతో సమావేశం కావడంతో ఆమె రాజకీయ భవిష్యత్పై పలు ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి.
ఇదిలా ఉంండగా.. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డికి కూడా ఉద్వాసన తప్పలేదు. చిన్నారెడ్డి స్థానంలో గద్వాల విజయలక్ష్మిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్గా నేరెళ్ల శారదను నియమించారు. కుడా చైర్మన్గా గుండు సుధారాణిని నియమించారు.
మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. కొండా సురేఖ తన కూతురు వ్యాఖ్యలపై అధిష్టానానికి పలుమార్లు వివరణ ఇచ్చుకున్నారు. దీనిపై అన్ని కోణాల్లో విచారణ జరిపిన కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలని హైకమాండ్‌కు సిఫార్సు చేసింది.
కొండా సురేఖ స్వతహాగా మంత్రి పదవి నుంచి తప్పుకునేందుకు ముందుకు రాకపోవడంతో బర్తరఫ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. కొండా సురేఖను బర్తరఫ్ చేస్తున్నట్లు లేఖను గవర్నర్కు సీఎంవో పంపింది. రెండు రోజులుగా మంత్రి సురేఖ ఎపిసోడ్ హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే.
సుస్మిత వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతమని, ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని కొండా సురేఖ దంపతులు చెప్పిన సమాధానంపై కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ సంతృప్తి చెందలేదు. తమ కూతురిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని, దీనిపై క్రమశిక్షణా కమిటీకి చెప్పాల్సింది వివరణ రూపంలో లిఖితపూర్వకంగా ఇచ్చామని కొండా సురేఖ దంపతులు ఇప్పటికే స్పష్టం చేశారు.
