సూర్యపేట టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇంట్లో ఏసీబీ సోదాలు..

సూర్యపేట టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇంట్లో ఏసీబీ సోదాలు..

అవినీతి తిమింగలాలపై ఏసీబీ పంజా విసురుతోంది. సూర్యాపేట మున్సిపాలిటీలో అవినీతి గుట్టురట్టు అయింది. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఉయ్యాల సోమయ్య అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో చిక్కారు.

ఈ క్రమంలో ఇవాళ ఒకేసారి మూడు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మానస నగర్‌లో ఉన్న సోమయ్య నివాసంతో పాటు, ఆయన ఆఫీసులోనూ, అలాగే హైదరాబాద్‌లోని హయత్‌నగర్, సూర్యనగర్‌లో ఉన్న సొంత ఇంటిలోనూ ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి.

ఈ సోదాల్లో పలు కీలక పత్రాలు, అక్రమ ఆస్తులకు సంబంధించిన ఆధారాలను అధికారులు సేకరిస్తున్నట్లు సమాచారం. అయితే ఏ కేసుకు సంబంధించి ఈ దాడులు జరుగుతున్నాయి? సోమయ్య ఎంత మొత్తంలో లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికారు? అనే పూర్తి వివరాలపై ఏసీబీ అధికారుల నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.