ఇండియాలో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన ఫిలిప్స్.. తక్కువ రేటుకే అమెజాన్లో అందుబాటులో..

ఇండియాలో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన ఫిలిప్స్.. తక్కువ రేటుకే అమెజాన్లో అందుబాటులో..

ఫిలిప్స్ కంపెనీ గురించి తెలిసే ఉంటుంది. ఎన్నో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అందించిన ఈ కంపెనీ మొట్టమొదటి సారి స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఫిలిప్స్ నుంచి S7221 5G స్మార్ట్ ఫోన్ మన దేశంలో విడుదలైంది.

బడ్జెట్ సెగ్మెంట్లో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్.. 6జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి ఉంది. ఈ హ్యాండ్సెట్ 120Hz డిస్ ప్లే, డ్యూయల్ 5G సిమ్ సపోర్ట్, 5, 700mAh బ్యాటరీ, 64-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది.

ఇండియాలో ఫిలిప్స్ S7221 5G 6GB + 128GB ధర రూ.20,499 కాగా, 8GB + 128GB వేరియంట్ ధర రూ. 22,499. బ్లాక్, బ్లూ, గ్రే రంగుల్లో ఈ స్మార్ట్ ఫోన్ తయారైంది. ఈ-కామర్స్ వెబ్ సైట్ అమెజాన్లో ఈ స్మార్ట్ ఫోన్ను ఆర్డర్ చేసుకోవచ్చు. డిస్ ప్లే విషయానికొస్తే.. 6.67-అంగుళాల HD (720x1,600 పిక్సెల్స్) LCD ప్యానెల్తో వస్తుంది.

ఈ ఫోన్ ఆక్టా-కోర్ స్పెడ్ ట్రమ్ T765 ప్రాసెసర్తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్తో నడుస్తుంది. ఫిలిప్స్ స్మార్ట్ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ బరువు 200 గ్రాములు.