Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10: హౌస్‌లోకి ఆ ఆరుగురు కామనర్స్‌? బిగ్గెస్ట్ వినోద జాతరకు కౌంట్‌డౌన్ స్టార్ట్!

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10: హౌస్‌లోకి ఆ ఆరుగురు కామనర్స్‌? బిగ్గెస్ట్ వినోద జాతరకు కౌంట్‌డౌన్ స్టార్ట్!

బుల్లితెర హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా ' బిగ్ బాస్ తెలుగు సీజన్10' సరికొత్త రికార్డులకు తెరలేపుతోంది. 'ఫోర్ సూపర్‌స్టార్స్.. ఫోర్ హౌసెస్.. వన్ ఎపిక్ మోమెంట్' అంటూ తెలుగు (నాగార్జున), తమిళం (విజయ్ సేతుపతి), కన్నడ (సుదీప్), మలయాళం (మోహన్‌లాల్) హోస్ట్‌లతో మేకర్స్ వదిలిన ప్రోమో నెట్టింట తుఫాన్ రేపుతోంది. ఒకే రోజు.. అంటే సెప్టెంబర్ 6న సాయంత్రం 7 గంటలకు స్టార్ మా, డిస్నీ+ హాట్‌స్టార్‌లలో ఈ డిజిటల్ రియాలిటీ జాతర ఘనంగా ప్రారంభం కానుంది. టాలీవుడ్ కింగ్ నాగార్జున గ్లామరస్ అండ్ స్టైలిష్ హోస్టింగ్‌తో మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యారు.

హౌస్‌లోకి వెళ్లే కామనర్స్ ఎవరు?

అయితే ఈ సారి ' బిగ్ బాస్ తెలుగు సీజన్10' హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే  సెలబ్రిటీలతో పాటు 'అగ్నిపరీక్ష 2' నుంచి హౌస్‌లోకి వెళ్లే కామనర్స్ ఎవరు? అనే దానిపై ఆసక్తి నెలకొంది. 'అగ్నిపరీక్ష 2' కు లో ఉన్న 15 మందిలో ఇప్పటికే కొందరు బయటకు వచ్చేశారు. మిగతా వారి మధ్య పోటీ జరుగుతోంది.  వీరిలో ఫైనల్ గా ఐదుగురు లేదా ఆరుగురు కామనర్స్‌ను  బిగ్ బాస్ హౌస్‌లోకి పంపేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 

టాప్ ఓటింగ్ లో వీరే?

వీరిలో ముఖ్యంగా రైతుగా, సింగర్‌గా యూట్యూబ్‌లో ఫేమస్ అయిన ఝాన్సీ.. అగ్నిపరీక్షలో తన ఆటతీరుతో ఆకట్టుకుని దాదాపు బిగ్ బాస్ హౌస్ బెర్త్ ఖరారు చేసుకున్నట్లు లీకుల ద్వారా తెలుస్తోంది. రైతు బిడ్డ కార్డ్ పై విమర్శలొచ్చినా, వాటన్నింటినీ తిప్పికొట్టి గ్రాండ్ ఎంట్రీకి సిద్ధమైంది. ఇక యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న రోహిత్ , అమన్ఇద్దరూ తమదైన ప్రాంప్ట్ పర్ఫార్మెన్స్‌తో ఫైనల్ కంటెస్టెంట్ల లిస్ట్‌లో ముందంజలో ఉన్నారు. 

►ALSO READ | Sumalatha: యశ్ ఎదుగుదల చూసి ఓర్వలేకే ఈ ట్రోలింగ్.. రాకింగ్ స్టార్‌కు సపోర్టుగా సుమలత పోస్ట్!

మరోవైపు చరణ్,  శ్రిష్టి అగ్నిపరీక్ష ఓటింగ్ ట్రెండ్స్‌లో దూసుకుపోతూ హౌస్ ఎంట్రీకి దాదాపు ఓకే అయ్యారని సమాచారం.  గ్లామర్ అండ్ కాన్ఫిడెంట్ టింగ్‌తో రాజాకుమారి , షాలిని హౌస్‌లో సర్ ప్రైజ్ ఎంట్రీగా నిలిచే అవకాశాలు మెండుగా టాక్ వినిపిస్తోంది. ఓటింగ్ ఆధారంగా వీరిలో ఎవరు తుది కంటెస్టెంట్‌గా ఎంపికవుతారనేది ఆదివారం గ్రాండ్ లాంచ్ రోజున రివీల్ కానుంది. వీరిలో కొందరు మధ్యలో వైల్డ్ కార్డ్ తో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

సెలబ్రిటీల లిస్ట్ లీక్..

గ్లామర్, కామెడీ మేళవింపుగా ఈసారి సెలబ్రిటీల లిస్ట్ చాలా క్రేజీగా డిజైన్ చేశారు. బుల్లితెరతో పాటు వెండితెర స్టార్స్ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.  వారిలో ముఖ్యంగా త్రిగుణ్ (ఆదిత్ అరుణ్), నటుడు కృష్ణుడు, ముఖేష్ గౌడ, దేబ్జానీ మోదక్, పల్లవి గౌడ, తేజస్విని గౌడ, కావ్యశ్రీ, ఈశ్వర్ సాయి, యాంకర్ వర్షిణి, సుధీర్ రెడ్డి,  జబర్దస్త్ ఆటో రాంప్రసాద్, రాకింగ్ రాకేష్, పొట్టి నరేష్, నూకరాజు, ఎక్స్‌ప్రెస్ హరి, టెంపర్ వంశీ, ఆట సందీప్ భార్య జ్యోతి, యూట్యూబర్ నందు, కడలి సత్యనారాయణ పేర్లు వినిపిస్తున్నాయి. వీరి నుంచి 10 మంది హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.

అయితే 'బిగ్ బాస్ సీజన్ 10 'హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్ లిస్ట్ పై అధికారిక ప్రకటించలేదు.  తుది కంటెస్టెంట్లపై క్లారిటీ సెప్టెంబర్ 6న స్టేజ్‌పైనే వచ్చే అవకాశం ఉంది.  మరో 5 రోజుల్లో ప్రారంభం కానున్న ఈ ఎపిక్ రియాలిటీ షో సౌత్ బుల్లితెర రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. ' బిగ్ బాస్ తెలుగు సీజన్10'లో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ వార్ ఎలా ఉండబోతోంది చూడాలి మరి.