- సుల్తాన్ బజార్ మెటర్నటీ హాస్పిటల్ లో ఫస్ట్ సర్టిఫికెట్ జారీ
- వారంలో మూడు కార్పొరేషన్లలో పూర్తిస్థాయిలో ప్రారంభం
హైదరాబాద్ సిటీ, వెలుగు: బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్‌ఎస్) ద్వారా జారీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మంళవారం నిర్వహించిన ట్రయల్ సక్సెస్ అయ్యింది. గోషామహల్ సర్కిల్ లోని సుల్తాన్ బజార్ మెటర్నటీ హాస్పిటల్ నుంచి తొలి బర్త్ సర్టిఫికెట్ అందజేశారు. మరో వారంలో క్యూర్ పరిధిలోని మూడు కార్పొరేషన్లలో ఈ సిస్టమ్పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది. ముందుగా క్యూర్ పరిధిలో, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తేనున్నారు.
రూపాయి కట్టక్కర్లేదు.. మీ సేవకు వెళ్లక్కర్లేదు
ఈ పద్ధతిలో మీ సేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు పొందొచ్చు. ఇందుకు రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు. కొత్తగా జారీ చేసే ధ్రువపత్రాలపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ డేటా అంతా కేంద్రం తెచ్చిన సీఆర్ఎర్పోర్టల్లో ఉండడం వల్ల దేశంలో ఎక్కడినుంచయినా డౌన్లోడ్చేసుకోవచ్చు. ఈ పద్ధతి అమల్లోకి వచ్చిన తర్వాత సర్టిఫికెట్ పొందినవారు రెండు సార్లు మాత్రమే మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. 3 కార్పొరేషన్లలో నెల కింది వరకు 85,34,410 బర్త్ సర్టిఫికెట్లు నమోదుకాగా, వీటిలో 23 లక్షల సర్టిఫికెట్ల వివరాలను కేంద్ర పోర్టల్‌తో లింక్చేశారు. అలాగే 15,26,650 డెత్ సర్టిఫికెట్లు నమోదుకాగా, 6 లక్షల సర్టిఫికెట్ల డేటా షేర్ చేశారు.
30 రోజులే ఫ్రీ..
జనన, మరణాల నమోదు విషయంలో 30 రోజుల్లోపు నమోదు చేసుకుంటే ఉచితంగా ఇవ్వనున్నారు. ఏడాది ఆలస్యమైతే జిల్లా రిజిస్ట్రార్ పర్మిషన్తో ఫైన్కట్టి నమోదు చేసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. ఒకటి నుంచి రెండేండ్లు ఆలస్యమైతే కలెక్టర్ పర్మిషన్తీసుకోవడంతో పాటు లేట్ ఫీజు చెల్లించాలి.. అదే రెండేండ్లకు మించితే ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల ఆధారంగా బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు పొందాల్సి ఉంటుంది. హాస్పిటల్ లో పుట్టినా, లేదా చనిపోయినా అక్కడి నుంచే డైరెక్ట్‌గా సీఆర్ఎస్ పోర్టల్ లోకి వివరాలు పంపిస్తారు. చనిపోయిన సర్టిఫికెట్డైరెక్ట్ డౌన్లోడ్చేసుకోవచ్చు. కానీ, బర్త్సర్టిఫికెట్విషయంలో కొంచం తేడా ఉంటుంది. పుట్టిన వెంటనే పేరు చెప్తే సర్టిఫికెట్వెంటనే వస్తుంది. కానీ, పేరు పెట్టడానికి ఆలస్యమయ్యే వారి విషయాన్ని పరిగణలోకి తీసుకుని 30 రోజుల వరకు టైం ఇచ్చారు. ఆ లోపు పేరు పెట్టిన వెంటనే వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి సర్టిఫికెట్డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
