KPHBలో గజం 2 లక్షల 70వేలు.. రికార్డులు బద్దలు కొట్టిన భూముల ధరలు..

KPHBలో గజం 2 లక్షల 70వేలు.. రికార్డులు బద్దలు కొట్టిన భూముల ధరలు..

హైదరాబాద్ లో భూములు రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. కోకాపేట, గచ్చిబౌలి లాంటి ఏరియాల్లో ఇప్పటికే ఎకరం రూ.200 కోట్లు పలికి సంచలనం సృష్టిస్తే... కెపిసిహెచ్బీలో భూములు కూడా అదే రేంజ్ లో పోటీ పడుతున్నాయి. బుధవారం ( సెప్టెంబర్ 2 ) కేపీహెచ్బీలో హోసింగ్ బోర్డు భూములు గజం రూ.2 లక్షల 70 వేలు పలికినట్లు సమాచారం.

ఎలాంటి వివాదాలు లేని, అన్ని వసతులతో అభివృద్ధి చెంది మంచి డిమాండ్ ఉన్న కెపిహెచ్ బి ప్రాంతంలోని ప్లాట్లు బహిరంగం వేలంలో రికార్డు ధరలకు అమ్ముడుపోయాయి. KPHB 7th ఫేజ్ లోని 16 ఎంఐజి ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహించగా, ఒక చదరపు గజం భూమిని రూ. 2.70 లక్షలకు కొనుగోలు చేశారు.    ఈ ప్లాట్ల బహిరంగ వేలం కోసం ఆగస్టు 10 వ తేదీన హౌసింగ్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. 

ఈ ప్లాట్లకు చదరపు గజానికి  కనీస ధర రూ. 1.60 లక్షలుగా నిర్దారించగా, చదరపు గజం రూ.2.70 లక్షలకు అమ్ముడు పోయిందని, మరో ప్లాట్ ను చదరపు గజం రూ.2.36 లక్షలకు కొనుగోలు చేశారని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ గౌతం తెలిపారు. ఇంకో రెండు ప్లాట్లను 2.06 లక్షలకు వేలం పాటలో  కొనుగోలు చేసారని తెలిపారు.  

పూర్తి పారదర్శకంగా నిర్వహించిన ఈ వేలం పాటలో తమకు నచ్చిన  ప్లాట్లను దక్కించుకోడానికి మొత్తం 19  మంది బిడ్డర్లు పోటీ పడ్డారని... ఈ వేలంలో చదరపు గజం సగటు ధర సుమారు రూ.1.79 లక్షలు పలికిందని తెలిపారు. ఈ క్రమంలో బహిరంగ వేలం ద్వారా హౌసింగ్ బోర్డ్ కు సుమారు రూ. 47.14 కోట్ల మేర ఆదాయం వచ్చిందని తెలిపారు.