ఏ రకమైన భారీ ప్రచారాలు లేవు.. పేరుమోసిన స్టార్ కాస్టింగ్ అస్సలే లేదు.. కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఒక ఊహించని రికార్డులను నమోదు చేస్తోంది. కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిన్న చిత్రం.. ఏకంగా రూ. 50 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. సినీ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తూ ఊహకందని మ్యాజిక్ చేస్తున్న ఆ మూవీయే 'హనుమాన్ అంశ్' . పవిత్ర నీమ్ కరోలి బాబా జీవితాధారంగా విశాల్ చతుర్వేది దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ ఆధ్యాత్మిక చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది.
ఊహకందని మ్యాజిక్..
ఆగస్టు 7న థియేటర్లలోకి వచ్చిన ఈ 'హనుమాన్ అంశ్' సినిమా మొదటి రోజు కేవలం రూ. 10 లక్షలు మాత్రమే వసూళ్లు రాబట్టింది. తొలి రెండు వారాల్లో రూ. 1.40 కోట్లతో చాలా సాధారణంగా సాగిన ఈ చిత్రానికి.. ఆడియన్స్ నుంచి వచ్చిన అద్భుతమైన 'వర్డ్ ఆఫ్ మౌత్' తో మూడో వారంలో ఊహించని ఆదరణ లభించింది. ఏకంగా ఒక్క వారంలోనే రూ. 10.40 కోట్లు రాబట్టి అందరికీ మైండ్ బ్లాంక్ చేసింది. ఇప్పటివరకు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 54.74 కోట్ల నెట్ వసూళ్లు సాధించి.. ఈ ఏడాదిలోనే అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన బాలీవుడ్ చిత్రంగా నిలిచింది.
ఈ విజయంపై నటి, ఎంపీ కంగనా రనౌత్ స్పందిస్తూ.. ఇది కేవలం సినిమా కాదు, ఒక దివ్యమైన సత్సంగ్. నీమ్ కరోలి బాబా అనుభూతులను తెరపై అద్భుతంగా చూపించారు అని ప్రశంసల వర్షం కురిపించారు. అటు సినీ ప్రముఖులు సైతం ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి ఆశ్చర్యాన్ని వక్తం చేస్తున్నారు. చిన్న చిత్రమైనా కంటెంట్ ఉంటే స్టార్స్ తో పనిలేదు అని నిరూపిస్తోందంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
సిద్ధమవుతున్న పార్ట్-2..
బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షంతో చిత్ర బృందం ఫుల్ జోష్ లో ఉంది. దర్శకుడు విశాల్ చతుర్వేది స్వయంగా రాసిన 'డివైన్ డిసౌర్' (Divine Desire) పుస్తకం ఆధారంగా.. శోభినావ్ సత్యా (నీమ్ కరోలి బాబా పాత్రలో), చందన్ ఆనంద్, పూర్ణిమ తివారీలతో రూపుదిద్దుకున్న ఈ సినిమాను మొదటి నుంచే మూడు భాగాలుగా ప్లాన్ చేశారు. మొదటి భాగం అద్భుత విజయం సాధించడంతో.. ఇప్పుడు 'హనుమాన్ అంశ్ 2' పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి.
►ALSO READ | రూ. 200 కోట్లు దాటిన ‘ఇరుముడి’ కలెక్షన్లు.. ఈ పోస్టర్ సినిమాలో ఉందని ఎంతమందికి గుర్తుంది..?
రెండో భాగంలో నీమ్ కరోలి బాబా జన్మస్థలమైన ఫిరోజాబాద్‌తో పాటు ఆగ్రా, మధుర ప్రాంతాలలో సాగే ఆయన ముఖ్యమైన ఆధ్యాత్మిక ఘట్టాలను చూపించబోతున్నారు. చిన్న సినిమాగా వచ్చి తిరుగులేని విజయాన్ని అందుకున్న ఈ ఆధ్యాత్మిక ప్రయాణం పార్ట్-2లో ఎలాంటి మేజిక్ చేయబోతుందో అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్ని వర్గాల వారు ఈ మూవీని ఆదరిస్తున్నారని మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు..
India without BJP & RSS.
— End of Bhajpila (@EndOfBhajpila) September 2, 2026
Muslims watching Hanuman Ansh in a theatre. pic.twitter.com/3mBHCRED8A
