సినిమాలో కంటెంట్ ఉంటే చాలు తెలుగు ప్రేక్షకులు కాసుల వర్షం కురిపిస్తారని ‘ఇరుముడి’ సినిమా కలెక్షన్లు మరోసారి నిరూపించాయి. రవితేజ సినీ కెరీర్లోనే మర్చిపోలేని కమ్ బ్యాక్ హిట్ ఇచ్చారు. ‘ఇరుముడి’ గ్రాస్ కలెక్షన్లు 200 కోట్లు దాటాయని ఈ సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఇంట్రస్టింగ్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. ఈ సినిమాలో రవితేజ తన కూతురుకి మణి కంఠ అని పేరు పెట్టుకుని కంటికి రెప్పలా చూసుకుంటుంటాడు.
Every generation. Every theatre. One celebration. #Irumudi 💥
— Mythri Movie Makers (@MythriOfficial) September 2, 2026
From kids to elders, from youth to families.... everyone celebrated #Irumudi, making it a 200 CR+ GROSS WORLDWIDE
GENERATIONAL BLOCKBUSTER 🔥
✨స్వామి శరణం✨
Go watch RAVANNA’s RAMPAGE in cinemas ❤️🔥… pic.twitter.com/bnao86ph3i
ఈ తండ్రీకూతురి అనుబంధం ఇరుముడి సినిమాలో అద్భుతంగా పండింది. అందుకే.. రూ.200 కోట్ల కలెక్షన్ల పోస్టర్ కూడా పాపను అయ్యప్ప స్వామి రూపంలో.. పులి మీద కూర్చున్న మణికంఠుడిగా.. పక్కనే రవితేజ, ప్రియా భవానీ శంకర్ నవ్వుతూ నిల్చున్న ఫోజులో చూపిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే.. ‘ఇరుముడి’ సినిమాను నిశితంగా పరిశీలిస్తే.. ఈ పోస్టర్ సినిమాలో రవితేజ ఇంట్లోని గోడకు ఫొటో ఫ్రేమ్గా ఉంటుంది.
Valla intlo wall ki untadi ee photo ...
— Rick Grimes (@RickGrimes989) September 2, 2026
Entha mandhi observe chesaru 🌚#Irumudi pic.twitter.com/2YtjC8EQdf
‘ఇరుముడి’ సినిమా విడుదలై దాదాపు రెండు వారాలు అవుతున్నా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు పెడుతున్నారు. ఈ సెంటర్, ఆ సెంటర్ అని తేడా లేదు.. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ అని ప్రేక్షకులు చూడటం లేదు. ఏ థియేటర్ లో టికెట్లు అందుబాటులో ఉంటే.. ఆ థియేటర్ లో ‘ఇరుముడి’ సినిమాకు వెళుతున్నారు.
►ALSO READ | 'మా అస్తిత్వం నువ్వే నాన్నా'.. తండ్రిని తలచుకొని ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎమోషనల్!
చాన్నాళ్ల తర్వాత ఒక తెలుగు సినిమాకు ఆటోల్లో, ట్రాక్టర్లలో గంపగుత్తగా వెళ్లి మరీ థియేటర్లలో ‘ఇరుముడి’ సినిమా చూశారు. ‘ఇరుముడి’ టైటిల్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అయింది. అయ్యప్ప పాటలు, అయ్యప్ప మాలలో రవితేజ పోస్టర్స్.. సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చాయి. సినిమాలో కంటెంట్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్కు కనెక్ట్ కావడంతో రవితేజ కెరీర్లోనే బ్లాక్ బస్టర్ హిట్గా ఇరుముడి నిలిచింది.
