అయోధ్య ట్రస్ట్ సీఈవోగా ఆర్మీ మాజీ అధికారి జితేంద్ర మిశ్రా

అయోధ్య ట్రస్ట్ సీఈవోగా ఆర్మీ మాజీ అధికారి జితేంద్ర మిశ్రా

ఢిల్లీ: అయోధ్య రామ మందిర్ ట్రస్ట్ సీఈవో నియామకంపై ఉత్కంఠ వీడింది. రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాను అయోధ్య రామ మందిర్ ట్రస్ట్ సీఈవోగా నియమించారు. పశ్చిమ వైమానిక దళ కమాండ్ మాజీ చీఫ్గా జితేంద్ర మిశ్రా ఏళ్ల పాటు సేవలందించారు. అయోధ్య రామ మందిర ట్రస్ట్ తొలి సీఈఓ జితేంద్ర మిశ్రానే కావడం విశేషం. పాక్, భారత్ మధ్య ఉద్రిక్తతల సమయంలో.. ఆపరేషన్ సింధూర్కు ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా వెస్ట్రన్ కమాండ్‌కు నాయకత్వం వహించారు.

జితేంద్ర మిశ్రా 39 ఏళ్ల పాటు సేవలందించిన జితేంద్ర మిశ్రా 2026, ఏప్రిల్ 30న పదవీ విరమణ చేశారు. జితేంద్ర మిశ్రా పశ్చిమ వైమానిక దళ కమాండ్ అధిపతిగా పనిచేశారు. ఆయనకు 3 వేల గంటలకు పైగా విమానం నడిపిన అనుభవం ఉంది. ఆపరేషన్ సింధూర్‌లో కీలక పాత్ర పోషించారు. నివేదికల ప్రకారం, ఆయన ఆపరేషన్స్ టైగర్ హిల్, సఫేద్ సాగర్ సమయంలో కూడా కీలక పాత్ర పోషించారు.