చెన్నై: 2029లో విజయ్ ప్రధాని అభ్యర్థి అంశంపై కాంగ్రెస్, టీవీకే నేతల మధ్య మాటల యుద్ధం జరగుతోంది. ఈ క్రమంలో టీవీకే మహిళా ఎమ్మెల్యే కనిమొళి సంతోష్ హాట్ కామెంట్స్ చేశారు. 2029లో విజయ్ దేశ ప్రధాని అవుతారని.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధే విజయ్‌ను చేయి పట్టుకుని తీసుకెళ్లి మరీ పీఎం సీటులో కూర్చొబెడుతారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘రాహుల్ గాంధీ మద్దతు ఇచ్చి విజయ్‌ను తమిళనాడు ముఖ్యమంత్రిని చేశాడు. అదేవిధంగా 2029లో కూడా ఆయనే విజయ్‌ను దేశ ప్రధానిని చేస్తాడు. రాహుల్ విజయ్ చేయి పట్టుకుని తీసుకెళ్లి మరీ ప్రధాని కుర్చీలో కూర్చొబెడతాడు’’ అంటూ కనిమొళి కామెంట్స్ చేశారు. కనిమొళి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు.
ఇటీవల ఇండియా టుడే - సీ ఓటర్ సంయుక్తంగా నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే (TVK) అధినేత విజయ్ 9.2 శాతం ఓట్లతో తదుపరి భారత ప్రధాని అభ్యర్థి రేసులో మూడో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో ప్రస్తుత ప్రధాని మోడీ తొలి స్థానంలో ఉండగా.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సెకండ్ ప్లేస్లో నిలిచారు.
►ALSO READ | సీఎం విజయ్ మరో సంచలన నిర్ణయం: రైతులు, ఉపాధ్యాయులపై కేసులన్నీ ఎత్తివేత
అయితే, తదుపరి భారత ప్రధాని అభ్యర్థిగా విజయ్‌ను ప్రొజెక్ట్ చేయడంపై తమిళనాడు కాంగ్రెస్ భగ్గుమంటోంది. విజయ్‌ను పీఎం అభ్యర్థిగా ప్రచారం చేస్తే టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హెచ్చరించారు.
ఈ ఇష్యూపై కాంగ్రెస్, టీవీకే నేతల మధ్య డైలాగ్ వారు నడుస్తోన్న తరుణంలో.. 2029లో విజయ్ ప్రధాని అవుతారని.. రాహుల్ గాంధే విజయ్ ను పీఎం సీటులో కూర్చొబెడతారని ఎమ్మెల్యే కనిమొళి సంతోష్ వ్యాఖ్యానించడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లైంది. కనిమొళి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి మరీ.
