న్యూఢిల్లీ: ఆప్ఘానిస్తాన్తో జరగనున్న మూడు మ్యాచుల టీ20 సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో 15 మందితో కూడిన జట్టును మంగళవారం (సెప్టెంబర్ 1) సెలక్షన్ కమిటీ అనౌన్స్ చేసింది. హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యకు జట్టులో దక్కలేదు.
గాయం నుంచి కోలుకోకపోవడంతోనే అతడిని పక్కనబెట్టిన సమాచారం. ఇక, గాయాల కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరమైన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్ రౌండర్స్ నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా తిరిగి జట్టులోకి వచ్చారు. 15 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ ఈ సిరీస్‌కు ఎంపికయ్యాడు.
ఇటీవల జరిగిన ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్ లలో తీవ్రంగా నిరాశపర్చిన వికెట్ కీపర్ సంజు శాంసన్‌కు బీసీసీఐ మరోసారి అవకాశం కల్పించింది. కాగా, భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 17 వరకు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌కు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ఆతిథ్యం ఇస్తుండగా.. మ్యాచ్‌లు మాత్రం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగనున్నాయి.
భారత జట్టు ఇదే:
శ్రేయాస్ అయ్యర్ (c), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (wk), ఇషాన్ కిషన్ (wk), తిలక్ వర్మ (vc), శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రానా
ఆప్ఘాన్, ఇండియా టీ20 సిరీస్ షెడ్యూల్
మొదటి టీ20: సెప్టెంబర్ 13, 2026 (ఆదివారం) – ఢిల్లీ
రెండవ టీ20: సెప్టెంబర్ 15, 2026 (మంగళవారం) – ఢిల్లీ
మూడవ టీ20: సెప్టెంబర్ 17, 2026 (గురువారం) – ఢిల్లీ
