సింధూ నది జలాలపై ప్రపంచ బ్యాంకు ఏర్పాటు చేసిన హేగ్ కోర్టు తీర్పును భారత్ తిరస్కరించింది. ఆ సంస్థ ను చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. సింధూ జలాలను పంపిణీ నిలిపివేసే ఒప్పందం అమలులో ఉందని 2026 ఆగస్టు 31న స్పష్టం చేసింది.
హేగ్ తీర్పుపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. సింధూ జలాల ఒప్పందం అమలులో ఉందని.. విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. జమ్మూ కశ్మీర్ లో జల విద్యుత్ ప్రాజెక్టు పనులను పరిమితం చేయాల్సిందిగా హేగ్ తీర్పు ఇచ్చిన క్రమంలో ఇండియా ఈ వ్యాఖ్యలు చేసింది.
ఒప్పందంలోని నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘిస్తూ ప్రపంచ బ్యాంకు ఈ సోకాల్డ్ కోర్టును ఏర్పాటు చేసిందని, చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసిన ఈ సంస్థ గతంలో వెలువరించిన అన్ని ప్రకటనలను భారతదేశం ఎలాగైతే గట్టిగా తిరస్కరించిందో, అలాగే ఈ కోర్టు ఇచ్చిన ఈ సోకాల్డ్ అవార్డును కూడా తిరస్కరిస్తోందని ఇండియా స్పష్టం చేసింది.
