గంట కూడా పని చేయకుండా కోటి 24 లక్షల జీతమా? కేసీఆర్ రాజీనామా చేయాలి: సీఎం రేవంత్

గంట కూడా పని చేయకుండా కోటి 24 లక్షల జీతమా? కేసీఆర్ రాజీనామా చేయాలి: సీఎం రేవంత్

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజాపాలనకు వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా కేసీఆర్‌కు నేరుగా సవాల్ విసిరారు. వెయ్యి రోజుల్లో గంట కూడా ప్రజల కోసం పని చేయని కేసీఆర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు

ఈ వెయ్యి రోజుల్లో ఒక్క రోజు కూడా బయటకు రాని కేసీఆర్.. ఎలాంటి విధులకు హాజరుకాకుండానే కోటి 24 లక్షల జీతం తీసుకున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను కాపాడటానికి సెక్యూరిటీ, బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాల కోసం కలిపి ప్రభుత్వం ఈ వెయ్యి రోజుల్లో 22 కోట్ల రూపాయల ఖర్చు పెట్టిందని, ఏ ప్రభుత్వ ఉద్యోగైనా పని చేయకపోతే తీసేస్తారని ఆయన గుర్తుచేశారు. సెప్టెంబర్ 6 వరకు కేసీఆర్ రాజీనామా డిమాండ్ చేస్తూ మండల కేంద్రాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

కేసీఆర్‌కు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలని.. పదేళ్ల ఆయన పాలనపై, తన వెయ్యి రోజుల పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.