అవినీతి అధికారులపై ప్రాసిక్యూషన్‌‌‌‌‌‌‌కు అనుమతివ్వండి..సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎఫ్ జీజీ లేఖ

అవినీతి అధికారులపై ప్రాసిక్యూషన్‌‌‌‌‌‌‌కు అనుమతివ్వండి..సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎఫ్ జీజీ లేఖ



హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: లంచం తీసుకుంటూ రెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హ్యాండెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పట్టుబడిన, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన అధికారులపై ప్రాసిక్యూషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చర్యలు చేపట్టాలని ఫోరం ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గవర్నెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఎఫ్‌‌‌‌‌‌‌‌జీజీ)  డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. 

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను రక్షించేందుకు సచివాలయంలో బలమైన వర్గం పనిచేస్తున్నదని ఆరోపించింది. ఈ మేరకు ఫోరం అధ్యక్షుడు పద్మనాభరెడ్డి బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)కి లేఖ రాశారు. 2026 అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 16న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును లేఖకు జత చేశారు. నిందితులైన అధికారులపై ప్రాసిక్యూషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చర్యలు ప్రారంభించేలా ఏసీబీకి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ అనుమతి కోసం సచివాలయంలో పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఏసీబీ కేసులన్నింటినీ తదుపరి చర్యల కోసం తిరిగి ఏసీబీకి పంపించాలని విజ్ఞప్తి చేశారు.

 రాష్ట్రంలో ప్రతి నెలా సగటున 20 నుంచి 25 అవినీతి, అక్రమాస్తుల కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. ప్రాసిక్యూషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుమతి కోరుతూ ఏసీబీ డీజీ పంపిన నివేదికలు ప్రభుత్వానికి చేరిన తర్వాత వాటిని ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.