బ్యాంకులకు వెళ్లి ఏదైనా ముఖ్యమైన పని చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ సమాచారం మీకోసమే. పండుగలు, ప్రాంతీయ వేడుకలు, సాధారణ వీకెండ్ సెలవులతో కలిపి వచ్చే నెల అంటే సెప్టెంబర్ 2026లో దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులకు చాల రోజులు సెలవులు రానున్నాయి. అయితే రాష్ట్రాలు, నగరాలను బట్టి ఈ పండుగలు మారతాయి కాబట్టి, సెలవుల లిస్ట్ కూడా ప్రాంతాన్ని బట్టి వేరేలా ఉంటుంది.
ఎస్‌బీఐ నుండి హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ వంటి ప్రముఖ బ్యాంకు కస్టమర్లు బ్రాంచ్‌కు వెళ్లే ముందు బ్యాంక్ హాలిడేస్ లిస్ట్ ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. సెప్టెంబర్ నెలలో బ్యాంకులు ఏయే రోజుల్లో మూసి ఉంటాయో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.......
సెప్టెంబర్ 2026 బ్యాంకు హాలిడేస్ లిస్ట్ :
సెప్టెంబర్ 4 (గురువారం): జన్మాష్టమి, కృష్ణాష్టమి సందర్భంగా అహ్మదాబాద్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, గాంగ్‌టక్, తెలంగాణ, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కొచ్చి, కోల్‌కతా, లక్నో, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్, తిరువనంతపురం, ఆంధ్రప్రదేశ్ నగరాల్లో బ్యాంకులు పనిచేయవు.
సెప్టెంబర్ 12 (శనివారం): సెప్టెంబర్ నెలలో రెండవ శనివారం కావడంతో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు బంద్ ఉంటాయి.
సెప్టెంబర్ 14 (సోమవారం): గణేష్ చతుర్థి, వినాయక చవితి పండుగ సందర్భంగా బేలాపూర్, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, తెలంగాణ, ముంబై, నాగ్‌పూర్, పనాజీ, తెలంగాణ బ్యాంకులకు సెలవు.
సెప్టెంబర్ 15 (మంగళవారం): అహ్మదాబాద్, భువనేశ్వర్, పనాజీలో సంవత్సరి, నువాఖై లేదా గణేష్ చతుర్థి రెండో రోజు వేడుకల నిమిత్తం బ్యాంకులు మూసి ఉంటాయి.
సెప్టెంబర్ 21 (సోమవారం): శ్రీమంత శంకరదేవ జన్మోత్సవం, శ్రీ నారాయణ గురు సమాధి పండుగల కారణంగా గౌహతి, కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులు పనిచేయవు.
సెప్టెంబర్ 22 (మంగళవారం): కర్మ పూజ పండుగ సందర్భంగా రాంచీలో బ్యాంకులకు సెలవు.
సెప్టెంబర్ 23 (బుధవారం): మహారాజా హరి సింగ్ జీ జయంతి సందర్భంగా జమ్మూ, శ్రీనగర్ నగరాల్లో బ్యాంకులు బంద్ ఉంటాయి.
సెప్టెంబర్ 25 (శుక్రవారం): ఇంద్రజాతర వేడుకల కారణంగా గాంగ్‌టక్‌లో బ్యాంకులకు సెలవు దినం.
సెప్టెంబర్ 26 (శనివారం): నాల్గవ శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
వీటితో పాటు సెప్టెంబర్ నెలలో 6, 13, 20, 27 రోజుల్లో వచ్చే ఆదివారాలు అంటే సాధారణ వీకెండ్ సెలవుల్లో కూడా బ్యాంకులు పనిచేయవు.
సెలవు రోజుల్లో ఎలాంటి సేవలు అందుబాటులో ఉంటాయంటే
బ్యాంకు బ్రాంచ్‌లు మూసి ఉన్నప్పటికీ, డిజిటల్ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదు. యూపీఐ (UPI), మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం (ATM) సేవలు యథావిధిగా పనిచేస్తాయి. అయితే డైరెక్ట్ బ్రాంచ్‌కు వెళ్లి చేసే క్యాష్ డిపాజిట్లు, చెక్ క్లియరెన్స్‌లు, ఇతర వ్యక్తిగత పనుల కోసం సెలవు రోజులను మినహాయించి ఇతర పని దినాల్లో వెళ్లడం మంచిది.
