Mahesh Babu: నిన్ను చూసి ప్రతిరోజూ గర్వపడుతున్నా.. గౌతమ్‌కి మహేశ్ బాబు ఎమోషనల్ బర్త్‌డే విషెస్!

Mahesh Babu: నిన్ను చూసి ప్రతిరోజూ గర్వపడుతున్నా.. గౌతమ్‌కి మహేశ్ బాబు ఎమోషనల్ బర్త్‌డే విషెస్!

సూపర్ స్టార్ మహేశ్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని ఈరోజు (ఆగస్టు 31) 20వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని మహేశ్ బాబు,  నమ్రతా తన  కుమారుడికి ప్రేమపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. టీనేజ్ దాటి 20s లోకి అడుగుపెట్టిన తన ‘రాక్‌స్టార్’ కోసం మహేశ్ బాబు ఎమోషనల్ అండ్ క్రేజీ పోస్ట్ పెట్టారు.

గౌతమ్‌తో ఉన్న పిక్‌ను షేర్ చేస్తూ.. 'హ్యాపీ 20 GG! నీ జీవితంలో ఈ సరికొత్త అధ్యాయం మొదలవుతున్న వేళ, నీ కలలను ఎప్పుడూ ధైర్యంతో, దయతో సాకారం చేసుకోవాలని కోరుకుంటున్నా. నిన్ను చూసి ప్రతిరోజూ గర్వపడుతున్నా!' అంటూ మహేశ్ రాసుకొచ్చారు.

 

అటు తల్లి నమ్రతా శిరోద్కర్ కూడా "నీ లక్ష్యాలన్నీ సాధించాలి. లవ్ యు ఆల్వేస్"అని పోస్ట్ చేయగా, పిన్ని శిల్పా శిరోద్కర్ "నా ఫేవరెట్ చైల్డ్, నీకు నేనే బిగ్గెస్ట్ చీర్‌లీడర్" అంటూ బర్త్‌డే విషెస్ అందించారు.

ప్రస్తుతం గౌతమ్ ఘట్టమనేని న్యూయార్క్ యూనివర్సిటీ (NYU) లో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డ్రామా కోర్సు అభ్యసిస్తున్నారు. 'వన్ నేనొక్కడినే' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా  గౌతమ్ మెప్పించారు. ఇప్పుడు విదేశాల్లో థియేటర్ ఆర్స్ట్, యాక్టింగ్‌లో ప్రొఫెషనల్ శిక్షణ పొందుతూ తన సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి గట్టి పునాది వేసుకుంటున్నారు... దాంతో ఘట్టమనేని వారసుడి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఏ రేంజ్‌లో ఉండబోతోందోనని అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

మరోవైపు, సూపర్ స్టార్ మహేశ్ బాబు టాలీవుడ్ జాతకాన్ని మార్చే భారీ ప్రాజెక్ట్ 'వారణాసి'(Varanasi) తో బిజీగా ఉన్నారు. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో, విజయేంద్ర ప్రసాద్ కథతో గ్లోబల్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తోంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ విజువల్ వండర్ 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

తండ్రేమో రాజమౌళితో గ్లోబల్ వండర్స్ సృష్టిస్తుంటే, కొడుకేమో న్యూయార్క్‌లో నటనలో మెరుగులు దిద్దుకుంటున్నాడు. దీంతో 'బాస్ అక్కడ.. వారసుడు ఇక్కడ.. ఎంట్రీ ఇస్తే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే' అంటూ అభిమానులు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.  'మా ప్రిన్స్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు? డెబ్యూ మూవీ అనౌన్స్‌మెంట్ ఎప్పుడు ఇస్తారు సూపర్‌స్టార్?' అంటూ నెటిజన్లు, ఫ్యాన్స్ క్యూరియాసిటీతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.