రిటైర్మెంట్ ప్రకటించిన ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ

రిటైర్మెంట్ ప్రకటించిన ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ

అంతర్జాతీయ ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ రిటైర్మెంట్ ప్రకటించారు. తన ఫుట్ బాల్ కెరీర్ కు గుడ్ బాయ్ చెబుతున్నట్లు 2026 ఆగస్టు 31న ప్రకటించారు. నా మనసును, నా హృదయాన్ని బాధించే నిర్ణయం ఇది.. అయినప్పటికీ ఇది సరైన సమయం అని భావించి ఈ నిర్ణయం తీసుకున్నానని భావోద్వేగమైన పోస్ట్ చేశారు మెస్సీ. 

2026 ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో స్పెయిన్ చేతిలో ఓడినప్పటి నుంచి రిటైర్మెట్ గురించి ఆలోచిస్తున్నట్లు ఈ అర్జెంటీనా కెప్టెన్ పోస్ట్ చేశారు. ఈ నిర్ణయం తనను చాలా బాధిస్తోందని.. కానీ జాతీయ జట్టు నుంచి తప్పుకునే సమయం వచ్చినట్లు నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు.

తన తండ్రి మృతి తనపై చాలా ప్రభావం చూపిందని ఈ సందర్భంగా మెస్సీ పేర్కొన్నారు. నేను టీమ్ కోసం చాలా చేశానని భావిస్తున్నా. గెలిచినా, ఓడినా.. టీమ్ కోసం.. జెర్సీ కోసం తన శక్తి వంచన లేకుండా కృషి చేసినట్లు పేర్కొ్న్నారు. 

జులై 21నే రాసుకున్నా..

సమయం చాలా తక్కువగా ఉంది, అధ్యాయాలు ముగింపు దశకు చేరుకుంటున్నాయి,  ఇది నన్ను చాలా బాధిస్తోంది. జాతీయ జట్టులో భాగంగా ఉండటాన్ని నేను చాలా ప్రేమించాను,  ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. నా దగ్గర ఉన్నదంతా ఇచ్చేశాను. ఇవ్వడానికి నా దగ్గర ఇంకేమీ మిగల్లేదు. అంతేకాకుండా, అవకాశానికి అర్హులైన గొప్ప యంగ్ ప్లేయర్స్ కొందరు వస్తున్నారు.

గత 20 ఏళ్లుగా మీరు చూపిన ప్రేమకు, మద్దతుకు ధన్యవాదాలు. స్టేడియం లోపల నుండి మీ మాటలు వినలేకపోవడం నాకు చాలా బాధగా ఉంటుంది. ఇకపై నేను మీలో ఒకడిని అవుతాను, బయట నుండి ఎల్లప్పుడూ మద్దతు ఇస్తూ, ప్రోత్సహిస్తూ ఉంటాను.   

ఈ అందమైన, కష్టమైన ప్రయాణంలో ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉన్నందుకు, నాతో పాటు ఉన్నందుకు నా కుటుంబానికి ధన్యవాదాలు. ఈ ప్రయాణాన్ని పంచుకునే అవకాశం లభించిన ప్రతి కోచ్, సహచర ఆటగాడికి, అధికారికి ధన్యవాదాలు. నేను నాతో పాటు మరపురాని జ్ఞాపకాలను, క్షణాలను తీసుకువెళుతున్నాను.

నా సహచర ఆటగాళ్లతో కలిసి, మనం కేవలం కలలు కనగలిగిన క్షణాలను మీకు అందించాననే మనశ్శాంతితో, గర్వంతో నేను ఫుట్ బాల్ ను వీడుతున్నా. మీతో కలిసి ఇదంతా అనుభవించడం ఒక అద్భుతమైన అనుభూతి. ఐ లవ్ యూ!

నన్ను అర్జెంటీనా వాసిగా చేసినందుకు దేవుడా, నీకు ధన్యవాదాలు.

లెట్స్ గో  అర్జెంటీనా!

ఫైనల్ జరిగిన రెండు రోజుల తర్వాత, జూలై 21న నేను ఇదంతా రాసుకున్నాను. మా నాన్న గారికి జరిగిన దాని తర్వాత అంతకు మునుపటి కంటే మరింత దృఢంగా ఉన్నాను..  అని మెస్సీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రకటనలో తెలిపారు.

షాకింగ్ లో ఫ్యాన్స్

మెస్సీ రిటైర్మెంట్ ఫుట్ బాల్ ఫ్యాన్స్ కు షాకింగ్ కు గురిచేసింది. గ్రౌండ్ లో తమ అభిమాన స్టార్ ఆట కోసం ఎడబడే ఫ్యాన్స్.. ఆయన రిటైర్మెంట్ అంటే జీర్ణించుకోలేని విషయమే.

ఎంతమంది రౌండప్ చేసినా.. బాల్ ను పాస్ ఇవ్వాలన్నా.. చిన్న గ్యాప్ నుంచి కూడా గోల్ కొట్టాలన్నా అది మెస్సీకే సాధ్యం. తన కెరీర్ లో ఎన్నో అవార్డ్స్, రివాడ్స్ సాధించిన ఫుట్ బాల్ కు వీడ్కోలు పలకడం కాస్త జీర్ణించుకోలని విషయమే. 

 

మెస్సీ రికార్డ్స్:

207 క్యాప్స్
125 గోల్స్
68 అసిస్ట్ లు
1 వరల్డ్ కప్

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Leo Messi (@leomessi)