ఉక్రెయిన్ తో జరుగుతున్న నిరంతర యుద్ధానికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందని రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ప్రధాని మోదీ సూచంచారు. కావాలసిన అన్ని రకాల సహాయసహకారాలను అందిస్తామని తెలిపారు. 2026 ఆగస్టు 31న బిష్కెక్ లో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ లో కలిసిన సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు.
ప్రతి రోజు యుద్ధం అంటే మానవత్వాన్ని వెనక్కు నెట్టడమేనని.. యుద్ధాన్ని ముగించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. శత్రుత్వాన్ని తగ్గించేందుకు తీసుకునే చర్యలకు అన్ని విధాలుగ భారత్ సహకరిస్తుందని తెలిపారు.
పీఎం మోదీ వ్యక్తిగత ఆసక్తి కారణంగా రష్యా- ఇండియా సంబంధాలు మరింత బలపడుతున్నట్లు ఈ సందర్భంగా పుతిన్ కొనియాడారు.ఇరు దేశాల మధ్య పర్యాటకం స్పుత్నిక్ ప్రకారం 2025లో 16 శాతం పెరిగిందని అన్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం నుంచి బయటకు రావాలని.. మహాత్మాగాంధీ, గౌతమ బుద్ధుడు చెప్పినట్లు శాంతి స్థాపన దిశగా ముందడుగు వేయాలని కోరారు.
పుతిన్, మోదీ మధ్య ద్వైపాక్షిక సదస్సు 30 నిమిషాల పాటు జరిగింది. మీటింగ్ తర్వాత ప్రధాని మోదీ ఎక్స్ లో వీడియో ట్వీట్ చేశారు. పుతిన్ ను ఎప్పుడు కలిసినా ఆ ఆనందం వేరు అంటూ పోస్ట్ చేశాడు. నా స్నేహితుడిని కలవడం నాకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇండియాలో పుతిన్ గత పర్యటన విజయవంతంగా, గుర్తిండిపోయేలా జరిగిందని మోదీ కొనియాడారు.
