నేపాల్ కు సాయం .. 68.5 టన్నుల సామగ్రి పంపిన భారత్

నేపాల్ కు సాయం .. 68.5 టన్నుల సామగ్రి పంపిన భారత్

ఖాట్మాండు: భారీ వరదలతో అతలాకుతలమైన నేపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు భారత్ పెద్ద ఎత్తున మానవతా సాయాన్ని అందించింది. వరద బాధితుల కోసం మొత్తం 68.5 టన్నుల సహాయక సామగ్రిని పంపడంతోపాటు గాలింపు, రెస్క్యూ ఆపరేషన్లలో సహాయపడేందుకు ప్రత్యేక సాంకేతిక బృందాలు, ఫోరెన్సిక్ నిపుణులు, అత్యాధునిక పరికరాలను భారత్ తరలించినట్లు ఖాట్మాండులోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. 

ఆకస్మిక వరదల కారణంగా జలవిద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు టన్నెల్ నిపుణులతో కూడిన ప్రత్యేక సాంకేతిక బృందాన్ని భారత్ పంపింది. ఇందులో భాగంగా 11 టన్నుల సహాయక సామగ్రితో కూడిన నాలుగో విమానం ఆదివారం నేపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 'ఎక్స్' వేదికగా తెలిపింది.