అసలైన శత్రువును గుర్తించండి..అంతా ఏకతాటిపైకి రండి.. గల్ఫ్దేశాలకు మొజ్తబా పిలుపు

అసలైన శత్రువును గుర్తించండి..అంతా ఏకతాటిపైకి రండి.. గల్ఫ్దేశాలకు మొజ్తబా పిలుపు

టెహ్రాన్: గల్ఫ్ దేశాలు తమ అసలైన శత్రువు ఎవరో గుర్తించాలని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా మొజ్తబా ఖమేనీ కోరారు. శత్రువుల వ్యూహాలను అర్థం చేసుకోవాలని, ముస్లిం దేశాలన్నీ ఏకతాటిపైకి వచ్చి వాటిని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఆదివారం గల్ఫ్ దేశాల పాలకులకు మొజ్తబా ఈ మేరకు రాతపూర్వక సందేశం పంపారు. 

ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ పుట్టినరోజును పురస్కరించుకుని వెలువడిన ఈ సందేశాన్ని మొజ్తబా తన టెలిగ్రామ్ అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలంతా ఐక్యతను చాటాలని, శత్రువుల నుంచి పరస్పర రక్షణ కోసం సహకరించుకోవాలని ఈ సందేశంలో ఆయన కోరారు.

 కాగా, ఆరు నెలల క్రితం అమెరికా, -ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఆయన తండ్రి, అప్పటి సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోగా, అదే దాడిలో మొజ్తబా ఖమేనీ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఆ సంఘటనతో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఆయన ఇప్పటివరకు బహిరంగంగా కనిపించలేదు. తన తండ్రి అంత్యక్రియలకు కూడా హాజరుకాలేదు.