పీజీ, పీహెచ్‌డీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సైంటిస్ట్ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. వివరాలివే

పీజీ, పీహెచ్‌డీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సైంటిస్ట్ ఉద్యోగాలు..  ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. వివరాలివే


నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఇండియా (ఎన్ఐఎఫ్) దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌‌‌‌ విడుదల చేసింది.

పోస్టు పేరు: సైంటిస్ట్.

మొత్తం ఖాళీలు: సైంటిస్ట్ – డి  1, సైంటిస్ట్–సి 4, సైంటిస్ట్–బి 5. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా సమాన పోస్ట్ గ్రాడ్యుయేషన్/ డాక్టోరల్ డిగ్రీ కలిగి ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 40 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్  వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 29. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్టింగ్, సెమినార్/ ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.nif.org.in ను సందర్శించండి.