ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. బీహెచ్ఈఎల్‌లో కొలువులు

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. బీహెచ్ఈఎల్‌లో కొలువులు

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ, మహారత్న కంపెనీ అయిన భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ సూపర్​వైజర్, హిందీ ట్రాన్స్​లేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 10.

మొత్తం ఖాళీలు: 64.

విభాగాల వారీగా ఖాళీలు
ప్రాజెక్ట్ ఇంజినీర్ (8): క్వాలిటీ (ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్) 6, క్వాలిటీ – మెకానికల్ 1, ఫ్యాక్టరీ సర్వీసెస్ 1.
ప్రాజెక్ట్ సూపర్​వైజర్ (55): ఫ్యాక్టరీ సర్వీసెస్ (సివిల్) 1, ఫ్యాక్టరీ సర్వీసెస్ (ఎలక్ట్రికల్) 1, సిస్టమ్ టెస్టింగ్ 8, ట్రాక్షన్ సైట్ సర్వీసెస్ 45. 
హిందీ ట్రాన్స్ లేటర్ – రాజ్యభాషా (ఎఫ్​టీఏ 
గ్రేడ్–III) 1.

విద్యార్హతలు

ప్రాజెక్ట్ ఇంజినీర్– క్వాలిటీ, ఫ్యాక్టరీ సర్వీసెస్:  గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్ లో బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి. 
ప్రాజెక్ట్ సూపర్​వైజర్: సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్, ఇనుస్టుమెంటేషన్ విభాగంలో డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. 
హిందీ ట్రాన్స్​లేటర్: డిగ్రీ స్థాయిలో ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా చదివి హిందీలో మాస్టర్స్ డిగ్రీ లేదా డిగ్రీ స్థాయిలో హిందీ ఒక సబ్జెక్టుగా చదివి ఇంగ్లిష్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా హిందీ, ఇంగ్లిష్‌ల్లో మాస్టర్స్ డిగ్రీ లేదా హిందీ, ఇంగ్లిష్ ప్రధాన సబ్జెక్టులుగా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు (2026, నవంబర్ 1 నాటికి)

ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ సూపర్​వైజర్ పోస్టులకు 32 ఏళ్లు, హిందీ ట్రాన్స్​లేటర్ పోస్టులకు 36 ఏళ్లు మించకూడదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్డ్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీలు రూ.236, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్ సర్వీస్​మెన్ అభ్యర్థులకు ఫీజు ఉండదు.
లాస్ట్ డేట్: డిసెంబర్ 10.
సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రూట్నీ, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు వెబ్​సైట్ careers.bhel.inను సందర్శించండి. 

– వెలుగు, ఎడ్యుకేషన్