Alias Rukmini: ప్యారడైజ్ మూవీతో విమర్శలు ఎదుర్కొన్న హీరో నాని, నిర్మాతగా ఓ ఆసక్తికర ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అదేనండి బాబు అలియాస్ రుక్మిణీ.. నితిన్ కథనాయకుడిగా నటించబోతుండగా, ఆఫియా సయ్యద్ హీరోయిన్‌గా పరిచయమవుతోంది. డిసెంబర్ 4 (వచ్చే శుక్రవారం) ఈ సినిమా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
సుమ బలవంతంతో నాని కంబైన్డ్ ప్రామిస్:
ప్రీ-రిలీజ్ స్టేజీపై మూవీ గురించి మాట్లాడిన నాని.. డిసెంబర్ 04న అలియాస్ రుక్మిణీ చూసి ఓ బ్యూటిఫుల్ సినిమా చూశామనే ఫీలింగ్ రాకపోతే నేను సినిమాలు తీయడం మానేస్తా, సుమ కనకాల యాంకరింగ్ మానేస్తారు.. ఇది కంబైన్డ్ ప్రామిస్ అంటూ సంచలన ప్రకటన చేశారు. గతంలో నాని నిర్మించిన కోర్ట్ సినిమా రిలీజ్ సమయంలోనూ ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడంతో, ఈసారి కూడా అలాగే ఏదైనా ప్రామిస్ చేయాలని యాంకర్ సుమ గట్టిగా కోరింది.. దీంతో నాని ఇలా ఫన్నీగా స్పందించాల్సి వచ్చింది.
మస్త్ రామ్తో పోలికా?:
ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్, ట్రైలర్ చూస్తుంటే సినిమాపై పాజిటివ్ బజ్ కనోస్తోంది. మారుపేరుతో అడల్ట్ నవలలు రాసే హీరో, ఓ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటాడు. పెళ్లయ్యాక భర్త గురించి అసలు నిజం పెళ్లానికి తెలిస్తే ఏం జరిగింది? అనే పాయింట్ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఆరేళ్ల క్రితం హిందీలో ఇదే తరహా కాన్సెప్ట్‌తో మస్త్ రామ్ అనే వెబ్ సిరీస్ వచ్చింది.. కానీ దాన్ని అడల్ట్ టోన్‌లో తీయగా, అలియాస్ రుక్మిణీని మాత్రం లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.
THE ‘ULTIMATE’ CONFIDENT STATEMENT from PRODUCER #Nani : “If you don’t feel satisfied with #AliasRukmini… I’LL STOP MAKING MOVIES…!!” https://t.co/Tnnu6Bab9d
— Rangasthalam (@RangasthalamIN) November 28, 2026
