బర్త్ డే విషెస్, ముఖ్యమైన రిమైండర్లు లేదా కార్యాలయ సమాచారాన్ని ఇకపై ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు. వాట్సప్ తీసుకొచ్చిన కొత్త షెడ్యూల్డ్ మెసేజెస్ ఫీచర్‌తో యూజర్లు తాము అనుకున్న తేదీ, సమయానికి మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా డెలివరీ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. దీనికోసం ఇకపై థర్ట్ పార్టీ యాప్‌లపై, రాత్రిపూట మేల్కొనాల్సిన పని లేదు.
పర్సనల్ చాట్లతో పాటు గ్రూప్ చాట్లలోనూ ఈ ఫీచర్ పనిచేస్తుంది. మెసేజ్‌ను కనీసం 10 నిమిషాల తర్వాత నుంచి గరిష్ఠంగా రెండు వారాల వరకు ముందుగానే షెడ్యూల్ చేసుకునే చాన్స్ ఉంది. మీరు సెట్ చేసిన సమయానికి ఫోన్లో ఇంటర్నెట్ లేకపోయినా లేదా వాట్సప్ క్లోజ్ చేసినా మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా డెలివరీ అవుతుతాయి.
టెక్స్ట్, లింకులు, ఫొటోలు, వీడియోలను షెడ్యూల్ చేయొచ్చు. వీటన్నింటికీ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ సెక్యూరిటీ ఉంటుంది. అయితే, ప్రస్తుతం డాక్యుమెంట్లను (పీడీఎఫ్) షెడ్యూల్ చేసే సదుపాయం లేదు. మెసేజ్‌లు డెలివరీ కాకముందు చాట్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్‌లోని ప్రత్యేక సెక్షన్లో వాటిని చూడొచ్చు. అవసరం లేదనుకుంటే ఈజీగా డిలీట్ చేయొచ్చు.
ఇక గ్రూప్‌లో షెడ్యూల్ చేసిన మెసేజ్, అది డెలివరీ అయ్యే సమయానికి గ్రూప్‌లో ఉన్న సభ్యులకు మాత్రమే వెళ్తుంది. ఆ తర్వాత కొత్తగా చేరే సభ్యులకు పాత షెడ్యూల్డ్ మెసేజ్ కనిపించదు. ప్రస్తుతం కొంతమంది ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.
ఎలా సెట్ చేయాలంటే..
- ముందుగా ఏదైనా వ్యక్తిగత లేదా గ్రూప్ చాట్ ఓపెన్ చేసి అందులో టెక్స్ట్ లేదా ఫొటో/వీడియో/లింక్ అటాచ్ చేయండి.
- ఆ తర్వాత సెండ్ బటన్‌ను కొద్దిసేపు లాంగ్ ప్రెస్ చేయాలి.
- తేదీ, డెలివరీ సమయాన్ని ఎంచుకునే ఆప్షన్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- షెడ్యూల్డ్ చేశాక చాట్లోనే షెడ్యూల్డ్ మెసేజెస్ కోసం డెడికేటెడ్ సెక్షన్ కనిపిస్తుంది.
- అందులో షెడ్యూల్ చేసిన మెసేజ్‌ల వివరాలు ఉంటాయి.
గమనిక: మీరూ లైఫ్‌కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే.. కథను హామీపత్రంతో పాటు [email protected] కి మెయిల్ చేయండి.
