నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్(ఎన్‌పీసీ) టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 28 నుంచి డిసెంబర్ 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 15 (టెక్నికల్ అసిస్టెంట్(అకౌంట్స్) 10, టెక్నికల్ అసిస్టెంట్ 5).
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్, సైన్స్, కామర్స్, మేనేజ్మెంట్ విభాగాల్లో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
అకౌంట్స్, ఫైనాన్స్, ఆడిట్, ట్యాక్సేషన్ లేదా బడ్జెట్ వర్క్, అడ్మినిస్ట్రేటివ్ లేదా ఆఫీస్ వర్క్‌లో ఐదేళ్ల అనుభవం ఉండాలి.
కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ లేదా అటానమస్ సంస్థల్లో ఉద్యోగి అయి ఉండాలి.
కామర్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా సీఏ/ సీఎంఏ ఇంటర్మీడియట్ పరీక్ష ఉత్తీర్ణత సాధించాలి. లేదా
ఏదైనా విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగి ఉండాలి.
వయసు: 2026, డిసెంబర్ 28 నాటికి 30 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ఫీజు: ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్/ అన్ రిజర్వ్డ్ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. ఇతరులకు ఫీజు ఉండదు.
లాస్ట్ డేట్: డిసెంబర్ 28.
ఫేజ్–I ప్రిలిమినరీ ఎగ్జామినేషన్: 2027, జనవరి 24.
ఫేజ్–II డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్: 2027, మార్చి.
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ npcrecruitments.inను సందర్శించండి.
- వెలుగు, ఎడ్యుకేషన్
