తెలంగాణలో ఆధార్ ఆపరేటర్ పోస్టులు.. టెన్త్, ఇంటర్ పాసైనోళ్లు వెంటనే అప్లయ్ చేసుకోండి..

తెలంగాణలో  ఆధార్ ఆపరేటర్ పోస్టులు.. టెన్త్, ఇంటర్ పాసైనోళ్లు వెంటనే అప్లయ్ చేసుకోండి..

సీఎస్‌‌‌‌సీ ఈ–-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ (సీఎస్​సీ) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న ఆధార్ సూపర్‌‌‌‌వైజర్ / ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌‌‌‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు విధిగా ఆధార్ సర్టిఫికేషన్ కలిగి ఉండాలి. అర్హత గల అభ్యర్థులు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో అప్లై చేసుకోవచ్చు.

పోస్టు పేరు: ఆధార్ సూపర్​వైజర్/ ఆపరేటర్ – జిల్లా. 

మొత్తం ఖాళీలు: 5. 

జిల్లాల వారీగా ఖాళీలు: మేడ్చల్ మల్కాజ్​గిరి 1, సూర్యాపేట 1, యాదాద్రి భువనగిరి 1, నిర్మల్ 1, నాగర్ కర్నూల్ 1. 

ఎలిజిబిలిటీ
గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి  పూర్తిచేసి ఉండాలి లేదా పదో తరగతితోపాటు రెండేళ్ల ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. లేదా పదో తరగతితోపాటు మూడేళ్ల పాలిటెక్నికల్ డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. 

వయోపరిమితి: కనీస వయసు 18 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 11.

సెలెక్షన్ ప్రాసెస్:  ఆధార్​ సూపర్​వైజర్ పరీక్ష, ఆధార్ ఎల్ఎంఎస్ సర్టిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ uidai.dexitglobalexams.comను సందర్శించండి.