ఢిల్లీలో 2026 సెప్టెంబర్ 5న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని బ్యాన్ చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిరసనను బ్యాన్ చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని కేంద్రం ప్రభుత్వం వేసిన పిటిషన్ ను ఆగస్టు 31న సుప్రీం కోర్టు తిరస్కరించింది. నిరసనకారులు శాంతియుతంగా, చట్టపరిధిలో నిరసన తెలుపుతున్నందున.. లా అండ్ ఆర్డర్ విషయాన్నిక కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలు చూసుకోవాలని సూచించింది.
చీఫ్ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్ మాల్య, జస్టిస్ వి మోహన తో కూడిన ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వ పిటిషన్ ను తిరస్కరించింది. నిరసనను బ్యాన్ చేసేందుకు బలవంతపు పరిస్థితులు లేవని పేర్కొంది. సీజేపీ తలపెట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారుతుందని ముందగా చెప్పలేమని.. ఏదైనా అనుమానం ఉంటే ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ పర్యవేక్షించాలని సూచించింది.
ఢిల్లీలో సెప్టెంబర్ 12, 13 తేదీలలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులు ఉన్న క్రమంలో.. ప్రొటెస్టును బ్యాన్ చేయాలని.. సదస్సు ముగిసిన తర్వాత మరో తేదీలలో పెట్టుకునేలా ఆదేశాలు జారీ చేయాలని.. శివం ఉపాధ్యయ, ఢిల్లీ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రాజేంద్ర సింగ్ పిటిషన్ వేశారు. సెన్సిటివ్ ఏరియాలైన లుటియెన్స్ ఢిల్లీ, ఇండియా గేట్, సెంట్రల్ విస్తా తదితర ప్రాంతాల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేసి నిరసన చేయడం వలన పరిస్థితులు అదుపుతప్పవచ్చునని పిటిషన్ వాదించారు.
BRICS సమ్మిట్ జరుగుతున్నందున.. చిన్న లాఠీ చార్జీ జరిగినా.. చిన్న ఘటన జరిగినా అంతర్జాతీయంగా భారత్ పరువుకు భంగం కలుగుతుందని పిటిషనర్ వాదించారు. అచితూ ఈ విషయంలోకి కల్పించుకునేందుకు కోర్టు నిరాకరించింది. లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉండేలా చూసుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది.
సెప్టెంబర్ 5న సీజేపీ ధర్నా:
సెప్టెంబర్ 5న ఇండియా గేట్ నుంచి పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు మార్చ్ నిర్వహించనున్నట్లు ఆగస్టు 24న సీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే. నీట్ (NEET) పేపర్ లీకేజీ సందర్భంగా జరిగిన నిరసనల్లో చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ధర్నా చేయనున్నట్లు సీజేపీ ప్రకటించింది.
ALSO READ : ప్రాణ స్నేహితురాలే ప్రాణాలు తీసింది
నిరసనకారులకు, కేసుల పాలైన విద్యార్థులకు, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని.. అందుకే ధర్నాకు దిగనున్నట్లు సీజేపీ పేర్కొంది. ఈ మూడు కిలోమీటర్ల మార్చ్ కు ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ మద్ధతు ప్రకటించింది. విద్యార్థులపై నమోదైన FIR లను కొట్టివేయాల్సిందిగా.. అదే విధంగా పెల్లెట్స్, బుల్లెట్స్ ఫైరింగ్ విషయంలో విచారణ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ మార్చ్ కు పిలిపునిచ్చారు.
