రఘు మాస్టర్ ఎన్నిక చెల్లదు.. డ్యాన్సర్స్ అసోసియేషన్ వర్గపోరుపై సుమలత షాకింగ్ కామెంట్స్!

రఘు మాస్టర్ ఎన్నిక చెల్లదు.. డ్యాన్సర్స్ అసోసియేషన్ వర్గపోరుపై సుమలత షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్ లో నెలకొన్న వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఈ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆగస్టు 30, 2026న  డ్యాన్సర్స్ అసోషియేషన్ సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.  అసోషియేషన్ ప్రెసిడెంట్ గా రఘు మాస్టర్ ను ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో డ్యాన్సర్ అసోషియేషన్ మాజీ అధ్యక్షురాలు సుమలత ఘాటుగా స్పందించారు. 

డాన్సర్స్ అసోసియేషన్ ను రెండు ముక్కలుగా చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అలాంటి వాళ్ళను నడిరోడ్డు మీద బట్టలు ఇప్పి కొడతాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కావాలని మా అసోసియేషన్ సభ్యులను కొంతమంది పెద్దలు తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు.. నిన్న  ( ఆగస్టు 30, 2026 ) జరిగిన మీటింగ్ లో ఆడ్ హాక్ కమిటీ వేశారు . కానీ ఆ కమిటీలో ఉన్న సగం మంది సభ్యులు అవినీతి పరులే అని సుమలత ఆరోపించారు

ఫెడరేషన్ నాన్ కోపరేషన్ చేస్తున్నట్టు మాకు నోటీస్ కూడా ఇవ్వలేదు . కానీ మిగతా 23 క్రాప్స్ నాన్ కోఆపరేషన్ చేస్తున్నట్టు లెటర్స్ పంపారు . తప్పు చేసిన వాళ్లకు ఫెడరేషన్ అధ్యక్షుడు ఎలా సపోర్ట్ చేస్తారు అని సుమలత ప్రశ్నించారు. మా డాన్సర్స్ అసోసియేషన్ కి ఇలా జరుగుతుంటే మిగతా 23 క్రాఫ్ట్స్ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి.  ఈరోజు డాన్సర్స్ అసోసియేషన్ కి జరిగింది రేపు మిగతా క్రాఫ్ట్స్ కూడా జరుగుతుంది. మిగతా క్రాఫ్ట్స్ కూడా ఫెడరేషన్ చేస్తున్న అన్యాన్ని ప్రశ్నించి బయటకు రావాలని ఆమె కోరారు.

ఫెడరేషన్ ను ప్రశ్నిస్తునందుకే ఈరోజు మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు సుమలత అన్నారు.. డాన్సర్స్ ఇబ్బందులను ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కి చెప్పాం.. కమిటీ వేస్తాము అన్నారు కానీ జరగలేదు .  సమస్య ఎక్కడ ఉందో గుర్తించాలి.  మెగాస్టార్  చిరంజీవి మా డాన్సర్స్ పిలిచి మాట్లాడారు ఆయనే మా సమస్యను పరిష్కరించాలి. బాలకృష్ణ మాతో మాట్లాడారు అనే విషయం నాకు తెలీదు .

టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్ లో నెలకొన్న వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఈ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆగస్టు 30, 2026న  డ్యాన్సర్స్ అసోషియేషన్ సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.  అసోషియేషన్ ప్రెసిడెంట్ గా రఘు మాస్టర్ ను ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో డ్యాన్సర్ అసోషియేషన్ మాజీ అధ్యక్షురాలు సుమలత ఘాటుగా స్పందించారు.  24 క్రాఫ్ట్స్ లో చాలా యూనియన్ల ఫెడరేషన్ కు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా బయటకు వస్తారని ఆమె పేర్కొన్నారు. తప్పులు చేసిన వాళ్ళే ఆడ్ హాక్ కమిటీ లో ఉన్నారు. అనవసరంగా నన్ను లాగుతున్నారు అని తనతో రఘు మాస్టర్ అన్నట్లు చెప్పారు.  . ఈ సమస్యలన్ని తొందరోనే సర్దుకుంటాయి అని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.