GHMC, CMC, MMC  కొత్త లోగోలను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

GHMC, CMC, MMC  కొత్త లోగోలను ఆవిష్కరించిన  సీఎం రేవంత్ రెడ్డి

జీహెచ్ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్,(సీఎంసీ),మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ)ల కొత్త లోగోలను సీఎం రేవంత్ రెడ్డి రిలీజ్ చేశారు. మూసారాంబాగ్ బ్రిడ్జి ప్రారంభోత్సవం అనంతరం మూడు లోగోలను రేవంత్ ఆవిష్కరించారు. 

గ్రేటర్ హైదరాబాద్ను మూడు కార్పొరేషన్లుగా విభజించడంతో పాటు  ఓ స్పెషలాఫీసర్, మరో ఇద్దరు కమిషనర్లను నియమించిన సంగతి తెలిసిందే. పాత జీహెచ్ఎంసీలో ఆరు జోన్లు, మూడేసి జోన్లతో సైబరాబాద్, మల్కాజి గిరి మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది హైదరాబాద్ మహానగరం చుట్టూరా 158 కి.మీ పరిధిలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపలి భూభాగాన్ని కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్)గా మారుస్తూ పాత జీహెచ్ఎంసీని పునర్విభజన చేసిన సంగతి తెలిసిందే. 

6 జోన్లతో జీహెచ్ఎంసీ

జీహెచ్ఎంసీని సుమారు 70 లక్షల జనాభాతో కూడిన ఆరు జోన్లకు పరిమితం చేశారు. సైబరాబాద్, మల్కాజ్ గిరి కార్పొరేషన్లలో సగటున 35 లక్షల జనాభా ఉండేటట్లుగా మూడు జోన్ల చొప్పున విభజించారు. జీహెచ్ఎంసీలో శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, ఖైరతాబాద్, గోల్కొండ, సికింద్రాబాద్ జోన్లు, 30 సర్కిల్స్, 150 డివిజన్లు ఉంటాయి. ప్రస్తుతం 689 చదరపు కిలోమీటర్లకు జీహెచ్ఎంసీ పరిమితమైంది. కమిషనర్ గా ఆర్వీ కర్ణన్నే కొనసాగించింది.

సైబరాబాద్లో మూడు జోన్లు

సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలో కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లున్నాయి. ఇందులో 16 సర్కిల్స్, 76 డివిజన్లు ఉన్నాయి. 613 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏర్పడింది. మొదటి కమిషనర్ గా జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్, ఐఏఎస్ ఆఫీసర్   సృజనను నియమించింది

మల్కాజిగిరిలోనూ మూడే

మల్కాజిగిరి కార్పొరేషన్ (ఎంఎంసీ)లో మల్కాజిగిరి, ఎల్బీనగర్, ఉప్పల్ జోన్లు ఉన్నాయి. ఇందులో కొత్తగా ఏర్పాటు చేసిన 14 సర్కిల్స్, 74 డివిజన్లు ఉన్నాయి. ఈ కార్పొరేషన్ 654 చ.కి విస్తీర్ణంతో ఏర్పడింది. మొట్టమొదటి కమిషనర్ గా జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్, ఐఏఎస్ ఆఫీసర్ 2013 బ్యాచ్కు చెందిన టి. వినయ్ కృష్ణారెడ్డి ఉన్నారు.