నల్లగొండలో రాజకీయంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 2026 ఆగస్టు 31వ తేదీన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంపై బీజేపీ నేతలు, కార్యకర్తలు కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. దీంతో అక్కడ పరిస్థితులు తీవ్ర ఆందోళన కరంగా మారాయి.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశారంటూ బీజేపీ నాయకులు, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి నిరసనకు దిగారు. ఫ్లెక్సీ ని చింపడంతో పాటు కోడిగుడ్లు, టమాటాలను విసిరివేసి నిరసనలకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణుల దాడిని ఖండిస్తున్నట్లు ఈ సందర్భంగా బీజేపీ నేతలు అన్నారు. మరోసారి పోలీసులు పార్టీ కార్యాలయాలు లేదా కార్యకర్తలపై దాడులకు ప్రయత్నిస్తే రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.
