రోజంతా హెల్దీగా యాక్టివ్  గా ఉండాలంటే... డైటీ ఈ 5 గింజలు తింటే చాలు.!

రోజంతా హెల్దీగా యాక్టివ్  గా ఉండాలంటే... డైటీ ఈ 5 గింజలు తింటే చాలు.!

శరీరంలో యాంటీఆక్సిడెంట్లను పెంచాలంటే.. మంచి డైట్ తీసుకోవాలి. అందులోనూ  మరికాస్త ఎక్కువగా ఇమ్యూనిటీని పెంచే ఫుడ్ తినాలి. అయితే దీనికోసం ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు ఉండే పళ్లు, కూరగాయలు. నట్స్ మాత్రమే అందరూ తింటుంటారు... అయితే ఇప్పుడు వీటికి కొన్ని గింజలను కూడా కలపాలి. 

డైలీ డైట్ లో ఐదు రకాల గింజలను కూడా కలిపితింటే.. రోజంతా హెల్దీగా.. యాక్టివ్  గా ఉంటాం. ఇమ్యూనిటీని పెంచుకోగలుగుతాం. రోజూ ఉదయాన్నే 15 గ్రాముల వరకు ఈ ఐదు గింజలను కలిపి తింటే ఫలితం ఉంటుంది.

  • సన్ ఫ్లవర్ గింజలు :  మనకు ఎంతో మేలు చేస్తాయి. యాంటీఆక్సిడెంట్లు అందిస్తాయి.
  • నువ్వులు :  ఎక్కువగా తీసుకోవడంతో శరీరం చురుకుగా ఉంటుంది.  షుగర్ పేషెంట్లకు ఇది ఎంతో మేలు. 
  • గుమ్మడి గింజలు : ఇమ్యూనిటీని పెంచుతాయి. ఎముకలు బలంగా తయారవుతాయి. 
  • సబ్జా గింజలు : ఇవి ఏ  కాలంలో తిన్నా బెనిఫిట్ ఉంటుంది. ఇమ్యూనిటీని పెంచి.. జలుబు, ఫ్లూ బారిన పడకుండా కాపాడతాయి.
  • జనపనార గింజలు:  రోజూ ఒక టేబుల్ స్పూన్ తింటే.. శరీరానికి ఇరవై అమైనో యాసిడ్స్ అందుతాయి. వీటిని తినడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి.