కవిత కంటతడి ..నిజామాబాద్ సభలో టీఆర్ఎస్ చీఫ్ భావోద్వేగం

కవిత కంటతడి ..నిజామాబాద్ సభలో టీఆర్ఎస్ చీఫ్ భావోద్వేగం
  • తండ్రిని, బిడ్డను వేరు చేయడంలో ప్రశాంత్ రెడ్డిది శకుని పాత్ర
  • హరీశ్‌‌నో, సంతోష్‌‌నో క్షమిస్తా.. కానీ ప్రశాంత్ రెడ్డిని కాదు
  • పిరికి దాన్ననుకోవద్దు.. నాకు ఆవేశం ఎక్కువ 
  • ఆడబిడ్డలకు సత్యం గుండెలల్ల ఉంటే కండ్లలకెళ్లి నీళ్లొస్తయన్న కవిత​
  • ఆమెను చూసి సభలోనే ఏడ్చేసిన పలువురు మహిళలు
  • నేను తప్పు చేయలే.. నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డను
  • ఈడీ, సీబీఐ నాలుగు నెలలు సతాయించినయ్
  • ఏం తప్పు చేశానని తీహార్ జైల్లో వేసిండ్రని ఆవేదన

నిజామాబాద్‌‌‌‌, వెలుగు: ఏ తప్పు చేయకున్నా తనను అక్రమంగా జైళ్లో పెట్టారని, కష్టాల్లో ఉన్న తనకు అండగా ఉండాల్సిన పార్టీ నిర్దాక్షిణ్యంగా వెళ్లగొట్టిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు.  తీవ్ర భావోద్వేగానికి గురై ఒక దశలో కన్నీళ్లు పెట్టుకున్నారు. సోమవారం నిజామాబాద్‌‌‌‌ ‌‌ పాత కలెక్టరేట్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌లో పాంచజన్య సంకల్ప సభలో ఆమె మాట్లాడారు. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత మొదటిసారి నిజామాబాద్​కు వచ్చిన కవితకు పార్టీ శ్రేణులు బోర్గాం వద్ద ఘన స్వాగతం పలికారు. ‘నాలుగేండ్లు ఈడీ, సీబీఐ వేధింపులు ఎదుర్కొన్న. ఏతప్పు చేయకున్నా తీసుకెళ్లి ఆరు నెలలు తీహార్‌‌‌‌ జైళ్లో పెట్టిన్రు. 

మన భాష కాదు.. మన రాష్ట్రం కాదు. లాక్కెళ్లి అక్రమంగా జైళ్లో పెడితే ఇందూర్‌‌‌‌ కోడలిగా ధైర్యం, రోషంతో కేసును ఎదుర్కొన్న. నా కేసులో సీబీఐ ఆఫీసర్‌‌‌‌పై ఎం‌‌క్వైరీ చేయమని సుప్రీం కోర్టు ఆదేశించింది. గతంలో ఏ కేసులో కూడా ఇలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. కష్టకాలంలో అండగా ఉండాల్సిన బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌, ఆ పార్టీ పెద్ద నాయకులు కర్కశంగా వ్యవహరించారు. కడుపున పెట్టుకోవాల్సిన ఆడబిడ్డను పార్టీ నుంచి నిర్దాక్షిణ్యంగా బయటకు పంపారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నియ్యత్‌‌‌‌, నీతి నిజాయితీ ఉన్నోళ్లకు ఒక్కోసారి బాధ తన్నుకొస్తది. అయితే నన్ను పిరికిదాన్ని అనుకోవద్దు. 

బాధ.. ఆవేశం తన్నుకొస్తున్నయ్‌‌‌‌. పుట్టింటి వాళ్లు నిర్దయతో వెళ్లగొడితే అత్తగారింటి వాళ్లు కడుపున పెట్టుకున్నరు. నాకు మోసం జరిగింది. ఆగం చేసిన్రు. అయినా నేను ఇంట్లో కూర్చోలేదు. నేను అనుభవించని పదవులు లేవు. చూడని రాజకీయాలు లేవు. పొద్దుపోక కొత్త పదవుల కోసం పార్టీ స్థాపించలేదు. గుండెలోతుల్లోంచి చెబుతున్న తెలంగాణకు చేయాల్సింది ఇంకా మిగిలి ఉంది. నా చుట్టూ పెద్ద లీడర్లులేరని ఎద్దేవా చేస్తున్నరు. పెద్ద లీడర్లున్న బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ను ప్రజలు ఇంటికి పంపలేదా?’అని ప్రశ్నించారు. స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం ఉద్యమించిన తెలంగాణ బిడ్డలు బీఆర్‌‌ఎస్‌‌కు అధికారం ఇస్తే ఎవరి బ్రతుకులు మారలేదని కవిత అన్నారు. బంగారు తెలంగాణ చేస్తామంటూ ప్రజలను నమ్మించి బీఆర్‌‌ఎస్‌‌‌‌ లోని నలుగురు నేతలు తమ ఇండ్లు బంగారం చేసుకున్నారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్లు ఖర్చుపెట్టి ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదని, పదేండ్ల అధికారం పోయి రెండున్నరేండ్లు దాటినా అవినీతి డబ్బు ఇంకా లెక్కబెడుతూనే ఉన్నారని ఆరోపించారు.

ప్రశాంత్‌‌‌‌రెడ్డి.. తిన్నింటి వాసాలు లెక్కబెట్టే రకం

కేసీఆర్ పెద్ద కొడుకు అని చెప్పుకునే బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌‌‌‌రెడ్డి తిన్నింటి వాసాలు లెక్కబెట్టి తండ్రితో తనను విడదీశాడని కవిత ఆరోపించారు. మహాభారతంలో శకుని మాదిరి తండ్రి, కూతుర్ని పాపిన ఆయనకు తన ఉసురు తగులుతుందని అన్నారు. ఎన్నికల్లో బీఆర్‌‌‌‌ఎస్‌‌ ఓడిన వెంటనే ముకుంద్‌‌‌‌రెడ్డి అనే లీడర్‌‌‌‌ ద్వారా కాంగ్రెస్‌‌‌‌లో చేరడానికి ప్రయత్నించాడని, వేం నరేందర్‌‌‌‌రెడ్డితో కూడా మంతనాలు చేశాడని ఆరోపించారు. జీవితంలో తాను హరీశ్‌‌రావు, సంతోష్‌‌‌‌రావు క్షమించొచ్చేమో కానీ ప్రశాంత్‌‌‌‌రెడ్డిని మాత్రం క్షమించబోనన్నారు. 

గంజాయి దందాతో సంపాదించిన డబ్బు పంపి గెలిచాడని, ఆయన ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తానన్నారు. నిజామాబాద్‌‌‌‌ జిల్లాలోని ఎమ్మెల్యేలందరినీ తాను గెలిపించానని, అంతా కలిసి తనను ఓడించారని ఆరోపించారు. కుట్రలతో తనను ఓడించినా వెనక్కి తగ్గనని, కచ్చితంగా గెలిచి చూపిస్తానన్నారు.

మునిగే కాంగ్రెస్‌‌‌‌లోకి ఎంపీ అర్వింద్‌‌‌‌

సెల్ఫీ వీడియోలు తీసి అడ్డగోలుగా కామెంట్స్‌‌‌‌ చేయ డం తప్పితే ఎంపీ అర్వింద్‌‌‌‌ తన ఏడేండ్ల పదవీకాలంలో చేసిందేమీలేదని కవిత ఫైర్‌‌‌‌ అయ్యారు. ఆయన పేరులో మాత్రమే ధర్మం ఉందని ఆయన చేసేదంతా అధర్మమేనన్నారు. ఓడిపోయే, మునిగిపోయే కాంగ్రెస్‌‌‌‌ చేరడానికి ఢిల్లీలో కేసీవేణుగోపాల్‌‌‌‌ను కలిశారని ఆరోపించారు. పార్టీ మారాల్సిన అవసరం ఆయనకు ఏమొచ్చిందని ఎద్దేవా చేశారు.

నా దగ్గరకు వచ్చేటోళ్లను బెదిరిస్తున్నరు

పదేండ్లు అడ్డగోలుగా సంపాదించిన బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లు తన దగ్గరకు వచ్చే వారిని బెదిరిస్తున్నారని కవిత మండిపడ్డారు. ‘బిడ్డలారా పాతరోజులు పోయినయ్‌‌.. రక్తాన్ని మరిగించి గులాబీ జెండాను నిలబెట్టిన సైన్యం మాది. చాలెంజ్‌‌‌‌ చేసి చెబుతున్న వచ్చే అసెంబ్లీ ఎలక్షన్‌‌‌‌లో నిజామాబాద్‌‌‌‌ జిల్లాలోని ఐదు సీట్లు గెలుస్తం’అని అన్నారు. అధికారం పోగానే బీఆర్ఎస్‌‌‌‌ లీడర్లు ప్రజల బాధలను మరిచారని, ప్రతిపక్ష రోల్‌‌‌‌ను బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పక్కనబెట్టిందన్నారు. 

ప్రజల పక్షాన తాము నిలబడతామని, కాంగ్రెస్‌‌‌‌ సర్కార్‌‌‌‌తో కొట్లాడుతామని చెప్పారు. వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ‘అధర్మం రాజ్యమేలినప్పుడు శ్రీకృష్ణుడు పాంచజన్యం ఊది యుద్ధానికి రెడీ అయ్యేవాడు. ఇప్పుడు నేనదే చేస్తున్న. ప్రజాసమస్యలపై ఎక్కడికక్కడ ఉద్యమా లు చేస్తం. ఎన్సీఎస్సెఎఫ్​‌‌ రీఓపెన్‌‌‌‌ జరిగేదా కా రైతు ఉద్యమానికి అండగా ఉంటా. 

ప్రభుత్వం ఏర్పాటు చేసిన వంద రోజుల్లో నిజాంషుగర్స్‌‌‌‌ పునరుద్ధరిస్తామని బీఆర్‌‌‌‌ ఎస్‌‌‌‌ మోసం చేసింది. రూ.18 కోట్లు ఇస్తే కార్మికుల సమస్యలు చాలా వరకు పరిష్కా రమయ్యేవి. నేను ఎన్నిసార్లు అడిగినా కేటీఆర్‌‌‌‌ డబ్బు ఇవ్వలేదు’అని అన్నారు.