నారాయణపూర్ బీసీ కాలనీలో బురద రోడ్డుపై వరి నాట్లతో నిరసన

నారాయణపూర్ బీసీ కాలనీలో బురద రోడ్డుపై వరి నాట్లతో నిరసన

రేగొండ, వెలుగు: జయశంకర్​భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం నారాయణపూర్ బీసీ కాలనీలో రోడ్లు బురదమయంగా మారడంతో మహిళలు వినూత్నంగా నిరసన తెలిపారు. 

సోమవారం బురదలో వరి నాట్లు వేసి ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లకు ఎన్ని సార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి రోడ్లు బాగుచేయాలని డిమాండ్​ చేశారు.